Friday, March 22, 2019

World water day by Adithya Pakide

ప్రపంచ జల దినోత్సవం:

ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి యెుక్క జనరల్ అసెంబ్లీ మార్చి 22 గా ప్రకటించడంతో 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22 న ప్రపంచ జల దినత్సవం ను జరుపుకుంటున్నారు.దీనిని మొదటిసారిగా   రియో డి జనీరో, బ్రెజిల్ లో పర్యావరణం మరియు అభివృద్ధి పై 1992 ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED) యొక్క ఎజెండాలో  ప్రతిపాదించబడింది.

ప్రకృతి ప్రసాదించిన సహజమైన వనరుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తుంది భూగర్భ జలాలనే.నీటి సంక్షోభం ఓ ప్రాంతానికి పరిమితమైంది కాదు ఇది ప్రపంచ వ్యాప్త సమస్య భారత్ లో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉంది 2018 ఏడాది జూన్ నాటికి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో 60 కోట్ల మంది ప్రజలు తీవ్ర నీటి కొరతతో సతమతమవుతున్నారు. జాతీయగీతం ఆలపిస్తూ వింధ్య, హిమాచల, యమునా ,గంగా ఉచ్ఛల జలధి తరంగ అంటూ విశేష జల సమృద్ధిని సంస్కరించుకునే సంస్కృతి మనది. కానీ అటువంటి గడ్డమీద జల వనరులను మన చేతులారా కలుషితం చేసుకుంటున్నాం. ప్రపంచంలో నీటి సౌకర్యం ఉన్న ప్రదేశంలోనే మొదటిసారిగా నాగరికత అభివృద్ధి చెందినది అనే విషయం  మన అందరికీ తెలుసు.


ఈ భూభాగం 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది.


"మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది నీటి కోసమే జరుగుతుంది " అనే మాట మనం తరుచుగా వింటూ ఉంటాము.దీనిని బట్టి ప్రపంచ దేశాలలో నీటికి గల ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థం  అవుతుంది.భూ తలంపై సుమారు 70 శాతం సముద్రాలు నదులు రూపంలో నీరు ఆవరించి ఉంది భూమిపై సుమారు 140 కోట్ల ఘన కిలో మీటర్ల నీటి పరిమాణం ఉన్నట్లు అంచనా.మన ఇంత పెద్ద మొత్తంలో నీరు ఉన్నప్పటికీ తాగడానికి గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం .ప్రపంచ జనాభాలో 17 శాతం జనాభా   భారత్ లో ఉంటే నీరు మాత్రం  నాలుగు శాతమే మన భారత్ కలిగి ఉంది. గంగానదిని భారతీయుల ఆత్మగా మన ప్రథమ ప్రధాని నెహ్రూ గారు అభివర్ణించారు కానీ  ప్రస్తుతం ఆ గంగా నది ఇప్పుడు అనేక నగరాల నుండి వెలువడే మురుగు నీటితో కలుషితం అయిపోయింది. గంగా నది యొక్క ప్రక్షాళన కోసం ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు  "నమామి గంగే " అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మురుగును తినే బ్యాక్టీరియాతో శుద్ధీకరణతో ఈ ప్రణాళిక సిద్ధమైందంటున్నా కానీ ఈ క్షాళన ఎప్పటికీ కొలిక్కి వస్తుందో కచ్చితంగా చెప్పలేం.నీటి లభ్యత విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక నదుల అనుసంధానం అనేది అడుగైనా కదలని  పరిస్థితుల్లో ఉంది.



*వర్షపు నీటిని ఒడిసి పడుతున్న చైనా:

నీటి సంబంధ సమస్యలు చైనాలో లెక్కకు మించి మనకు కనిపిస్తాయి మంచినీటి కొరత తోపాటు, జల కాలుష్యం అక్కడి ప్రజలను పట్టి పీడిస్తున్నాయి .వాటన్నిటి నుంచి బయటపడటానికి  "క్లీన్ వాటర్ " అనే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు పరుస్తుంది. దీనిని ఆదర్శంగా తీసుకొని మన కేంద్ర ప్రభుత్వం  "వాటర్ ఇండియా " అనే పథకానికి రూపురేఖలను దిద్దుతోంది.

*ఇజ్రాయిల్ అనుసరిస్తున్న డీశాలినేషన్ ప్రక్రియ:

సాంకేతిక పరిజ్ఞానం అధికంగా గా ఉన్న దేశాల్లో ఇజ్రాయిల్ అనేది ముందు వరుసలో ఉంటుంది కానీ పొదుపు ను నిర్లక్ష్యం చేసి ఇష్టారాజ్యంగా నీటిని వాడుకున్న ఫలితంగా ఆ దేశంలో నీరు అడుగంటి పోయింది.  తీవ్రమైన నీటి సమస్య నుంచి బయటపడటానికి ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం పైనే ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకునే సంస్కృతి ఇజ్రాయిల్ ది. సముద్రం నీటిని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని డి శాలినేషన్ అని అంటారు. ఈ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇజ్రాయిల్ లో పరిస్థితి మారిపోయింది.


* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం:


నీటి సరఫరా రాష్ట్ర పరిధిలోని అంశం అయినా నీటి వనరులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి పోతున్న దీని ద్వారానే కనుక కేంద్ర ప్రభుత్వం సాయం తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలి. భూగర్భ జల వనరులను వెలికితీతకు సంబంధించిన ప్రతి చట్టాలు ,నిబంధనలు అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యచరణ ప్రారంభించాలి వ్యవసాయం తాగునీటి అవసరాలు తీర్చడానికి సమగ్ర నీటి వనరుల యాజమాన్య విధానాలను రూపొందించాలి దేశం లో లభ్యమవుతున్న జలవనరుల్లో 70 శాతం కలుషితమయ్యాయి.ప్రపంచ నీటి నాణ్యత సూచీలో 122 దేశాల జాబితాలో భారత్ 120 వ స్థానంలో ఉండటం ఇందుకు ప్రధాన నిదర్శనం.

* తెలుగు రాష్ట్రాలలో నీటి సంరక్షణ విధానం:

ప్రపంచ దేశాలు నీటి సంరక్షణ అంశంపై కసరత్తు చేస్తుం డగా  రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు ప్రతిష్టాత్మకమైన కార్యక్ర మాలు చేపట్టాయి. తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ను మొదలెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టింది. ఈ రెండు కార్యక్రమాల యెుక్క కామన్ పాయింట్ నీరే. అయితే, వాటికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించి, వాటిని  స్థానిక ప్రజలతో, జన సమూహాలతో, గ్రామ పంచాయతీల వంటి స్థానిక సంస్థలతో మరింతగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది.ప్రజలలో నీటి వినియెూగం పైన మరియు దాని లభ్యతపైన అవగాహన కల్పించాలి.



* నీటి సంరక్షణ విధానాలు:


వర్షపు నీటిని ఒడిసి పట్టాలి .నదుల ద్వారా జలాలు సముద్రం పాలు కాకుండా అరికట్టాలి అందుకోసం కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేయడం అవసరం నగరాలు పట్టణాలు గ్రామాల్లో నీటిని ఒడిసి పట్టి చర్యలను విస్తృతంగా చేపట్టాలి నీటిని మనం ఉత్పత్తి చేయలేం. అందువలన ఉన్న నీటిని సద్వినియోగ పరచ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి వివిధ దేశాలలో జల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయాలి నీటిని ఒడిసి పట్టడం లో కొత్త మార్గాలు అన్వేషించాలి. భూగర్భ జల నిర్వహణ పైన ప్రజల్లో అవగాహన కల్పించడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. బిందు సేద్యం తుంపర సేద్యం మొదలైన విధానాలను వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించడం మూలంగా వ్యవసాయ రంగంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని పొందే దిశగా రైతులకు అర్థమయ్యేలా తెలియజేయాలి. కొండలు పర్వత ప్రాంతాలలో చెక్ డ్యాం లను ,దిగువ ప్రాంతాల్లో కందకాలను నిర్మించాలి. సాధారణంగా వాళ్లు ప్రాంతాలలో కందకాల నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టుకోగలం. లోతట్టు ప్రాంతాలలో చెరువుల నిర్మాణం జరగాలి.తరచుగా పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పెరుగు మెరుగుపరిచి భూగర్భ జలాలు పరిరక్షించాలి. నీటి వినియోగం పైన పౌర సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.నీటిని కలుషితం కాకుండా కాపాడటం మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వ్యవసాయానికి పరిశ్రమలకు సాధారణ గృహ అవసరాలకు వినియోగించడం వలన పెరుగుతున్న భూగర్భ జలాల పైన  ఒత్తిడిని తగ్గించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో నూటికి నూరు శాతం వాననీటి నిల్వ చేస్తున్నారు భారత్లో అది కేవలం ఆరు శాతం గానే ఉంది వర్షపునీటిని వివిధ రూపాల్లో నిర్వహిస్తే వ్యవసాయానికి అవసరమైన ఆధారపడాల్సిన అవసరం తలెత్తదు. అప్పుడే భూగర్భ వనరులను పదిలంగా భావితరాలకు అందించడం సాధ్యమవుతుంది.






World water day

No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...