Tuesday, September 12, 2017

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం _ by adithyapakide


8 సెప్టెంబర్ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (8 Sep International Literacy Day)
ప్రపంచం‌లో విద్యావ్యాప్తికోసం యునెస్కో తొలిసారిగా 1946లో సెప్టెంబరు 8వ తేదీన ఇరాన్‌లోని టెహ్‌రాన్‌లో సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని అదేరోజున నిర్వహించుకోవాలని యునెస్కో 1965లో సూచించినమేరకు 1966సం|| నుండి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. వయోజనులు, సంఘం, సమాజం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని నొక్కి చెప్పడమే ఈ ఉత్సవాల ఉద్దేశ్యం.
విద్య పై గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రతీ ఐదుగురు పురుషుల్లో ఒకరు మరియు మూడింట రెండు వంతుల మహిళలు నిరక్షరాస్యులుగా తేల్చింది. కొందరికి అక్షరాస్యత నైపుణ్యాలు అత్యల్పంగానూ, కొందరు పిల్లలు ఇప్పటికీ పాఠశాలకు బయట ఉండటము మరియు మరికొంతమంది అప్పుడప్పుడూ పాఠశాలకు హాజరౌతున్నారు. దక్షిణ మరియు పశ్చిమ ఆసియాలలో వయోజన అక్షరాస్యత రేటు అత్యల్పంగా 58.6% గాఉంది. అక్షరాస్యత రేటు మరీ తక్కువైన దేశాలు బుర్కినా ఫాసో, మాలి మరియు నైజర్‌లు.
ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతా సూచి అభివృధ్ధికోసం ప్రోత్సహించడంకోసం – ప్రజాబాహుళ్యం‌లో అక్షరాస్యతపట్ల, లిఖితాక్షరాలకుగల విశేషమైన విలువలపట్ల చెతన్యంకల్గించి అక్షరాస్యతా సమాజంవైపు ప్రోత్సహించడం కోసం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని విశేషంగా నిర్వహించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పలువురు మేధావులు, దాతృత్వ సంస్థలు, ప్రపంచాభివృధ్ధి పరిశోధనా కెంద్రం, రోటరీ ఇంటర్నేషనల్,మొంట్‌బ్లాక్, జాతీయ అక్షరాస్యతా సంస్థలు ఈ ఉద్యమం‌లో భాగస్వాములౌతున్నాయి.
అక్షరాస్యత వైపుగా సమాజం దృష్టిని ప్రోత్సహించడం, సామాజిక , మానవ అభివృద్ధికోసం వారు తమహక్కులను తెలుసుకోవటం కొరకు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంబరాలు నిర్వహించుకుంటాము. జీవితానికి ఆహారమెంత అవసరమో, విజయం సాధించడానికి అక్షరాస్యత అంతే ముఖ్యం. అక్షరాస్యతతో శిశుమరణాలు తగ్గించడం, జనాభా నియంత్రణ, లింగసమానత్వం సాధించడంద్వారా కుటుంబహోదా తద్వారా అంతర్జాతీయస్థాయిలో దేశంహోదాను పెరగడానికి దోహదపడుతుంది. నిరంతర విద్య పొందేందుకు ప్రజలను ప్రోత్సహిస్తే వారు కుటుంబం, సమాజంతోపాటు దేశంపట్ల తమబాధ్యతలను అర్థంచేసుకుంటారు.
కాలానుగుణంగా అక్షరాస్యతకు నిర్వచనాలు మరింత స్పష్టతదిశగా పయనిస్తున్నాయి.
- ప్రారంభం‌లో 3 Rs రీడింగ్, రైటింగ్, అర్ధిమెటిక్ (గణితం) గా వివరంచేవారు
- తదుపరి కాలం‌లో 4 Rs – పైమూడింటికి ఆదనంగా ‘ కంప్యూటర్ లిటరసీ”ని చేర్చారు.
- ఇటీవలి కాలం‌లో అక్షరాస్యత అంటే 3 Rs 4 Rs మాత్రమే కావనీ, బౌథ్ధిక, శారీరక, అధ్యాత్మిక/ కళాతత్త్వ వికాసాలతో పాటు పర్యావరణ, జీవవైవిధ్యాల పరిరక్షణలు వాటి ఆచరణ కూడా ఉంటుందని విద్యావేత్తలు, తత్త్వవేత్తలు భావిస్తున్నారు.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేడుకల అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి కొన్ని వ్యూహాత్మక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి సంవత్సరానికొక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ప్రస్తుత సంవత్సరానికి 2017 “ అక్షరాస్యత- అంకసమాజం (Literacy in the Digital World)” గా నిర్దేశించారు.
పౌరుల ప్రమేయంలేకుండా సమాజం‌ అన్ని పార్శ్వాల్లోకి డిజిటలైజేషన్ విస్తరించింది. జనాభా గణనలో అక్షరాస్యతతోబాటు అంకఅక్షరాస్యతని సైతం నమోదు చేయడం అవసరం కాబొతూంది.
మన జీవనం, వృత్తి, అధ్యయనం, సామాజికీకరణవంటివాటితోపాటు సమాచార సేకరణ, నిర్వహణ, సామాజిక సేవ, పారిశ్రామికోత్పత్తులతోపాటు మనం పనిచేసే విధానాన్నే మార్చేసింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం‌ లేకపోతే డిజిటల్ లేదా కంప్యూటర్ ఇల్లిటరేట్’గా పరిగణించబడటంతోపాటు తన వృత్తి, జీవన వ్యవహారాలలో వెనుకబడిపోతాడు.
అక్షరాస్యతోపాటు అంక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు నేటి జీవితానికి అత్యవసరమైనవి. నేటి ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఈదిశగా కృషిచేయాలి.
#World literacy day.
##September 8.
##Adithyapakide.

No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...