Friday, November 3, 2017

Karmanghat hanuman temple by adithyapakide

కర్మాన్ఘట్ ఆంజనేయస్వామి గుడి

నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయానికి చాలానే  చరిత్ర ఉంది.ఒక్కసారి చరిత్ర లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ ఆలయాన్ని కాకతీయులు పన్నెండవ శతాబ్దంలో  కట్టించారు. కాకతీయుల వంశంలో చివరి రాజయిన ప్రతాపరుద్రుడు మరియు ఆయన సైన్యం ఇక్కడికి వేట కోసం వచ్చినప్పుడు ఆయన  అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రిస్తున్నపుడు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో "రామా ......రామా..."అనే అరుపులు వినిపించాయి.అపుడు వెంటనే ఉలిక్కిపడి లేచిన ప్రతాపరుద్రుడు ఆ అరుపులు సమీపంలోని ఒక విగ్రహం నుండి వస్తున్నట్లుగా గమనించాడు.ఆ తరువాత ప్రతాపరుద్రుడు తిరిగి తన నగరమైన ఓరుగల్లుకి చేరుకున్నాక ఆ రోజు  కలలో ఆంజనేయస్వామి దర్శనమై తనకు ఆ ప్రదేశం లో ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించాడు.అపుడు తక్షణమే ప్రతాపరుద్రుడు ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఇదిలా ఉండగా 1687 లో గోల్కొండ పైకి దండయాత్ర చేసిన మెుఘల్ చక్రవర్తి ఐన జౌరంగజేబు హిందూ ఆలయాలని ధ్వంసం చేసే క్రమంలో ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్దకి వచ్చి దానిపై కి గునపంని ఎత్తగానే   'కర్ మాన్  ఘట్ ' అనే భీకరమైన అరుపు అతనికి వినపడింది.ఇప్పుడు మనం పిలుస్తున్న  కర్మాన్ఘట్ అనేది అప్పటినుండే వాడుకలోకి వచ్చింది.

ఇంతటి చరిత్రని కలిగి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆంజనేయస్వామి పుట్టినరోజున అంటే హనుమాన్ జయంతి రోజున ఇక్కడి పూజారులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .కొన్ని ప్రత్యేక రోజుల్లో అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.
#kakthiyas #Prathaparudra.
#karmanghat.#Hanumantemple.
##adithyapakide.



No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...