Tuesday, September 12, 2017

స్టేట్ఆర్కియాలజీ మ్యూజియం -Adithyapakide

స్టేట్ఆర్కియాలజీ మ్యూజియం
తవ్వకాలలో బయటపడిన విలువైన వస్తువులతో ఏర్పడిందే స్టేట్ ఆర్కియాలజీ  మ్యూజియం. ఇది నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్స్ లో ఉంది.ఇక్కడ కనిపించే ప్రతీ వస్తువూ చారిత్రాత్మకమైనదే.వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ మ్యూజియం భవంతిని 7వ నిజాం నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కట్టించాడు. ఇది ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ ని పోలి ఉంటుంది.మొదట్లో ఈ భవంతి  డాల్స్ హౌస్ గా పిలవబడేది. ఈ   భవంతిలో ముఖ్యంగా రెండు భాగాలున్నాయి. అవి
  1.అర్థచంద్రాకారపు భవంతి.
   2.ప్రధాన భవంతి.
ఈ రెండింటినీ ఆకాశం నుండి చూస్తే చుక్కల మధ్య నెలవంకలా ఇది కనిపిస్తుంది.
ఈ మ్యూజియంలో రాష్ట్ర వ్యాప్తంగా భౌద్ధ,జైన మతాలకు చెందిన వివిధ రకాలైన వస్తువులు, అవశేషాలు, రాతి,కాంస్య, ఇత్తడి విగ్రహాలు ప్రత్యేక గ్యాలరిీలలో మనం చూడవచ్చు. ఈజిప్ట్ మమ్మీ నుండి బుద్ధుడి అస్థికల వరకూ ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయి.
మ్యూజియం లోని ప్రత్యేక ఆకర్షణలు:
*ఈజిప్టు మమ్మీ:
ఇక్కడి మ్యూజియంలో ఉన్న ఈజిప్టు మమ్మీ 2500సంవత్సరాల క్రితం నాటిదనీ, ఈజిప్టు దేశపు 6వ ఫారో యొక్క కుమార్తెదని భావిస్తారు. దీనిని 6వ నిజాం యొక్క అల్లుడైన నవాబ్జంగ్ అప్పట్లోనే 1000 పౌండ్లకు కొని 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు బహుమతిగా ఇచ్చాడు.
మరణించిన వారి పట్ల ఈజిప్షియన్లకు ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. అదేమిటంటే వారు మరణించిన తర్వాత వారి ఆత్మలు అస్తిత్వాన్ని పొందడం కోసం వీలుగా శవాలను భద్రపరచడం.ఆ తరువాత ఇది ఒక ఆనవాయితీగా మారింది. ఈ ప్రక్రియను 'మమ్మీఫికేషన్ ' అని అంటారు.
*బిద్రీ పాత్రలు:
భారతదేశపు సాంప్రదాయక లోహ కళల్లో ఒకటైనది బిద్రీ పాత్ర కళ. లోహంలో మరికొన్ని లోహాలను అందంగా పొదగడమనే కళ ఇందులో దాగి ఉంటుంది.
*సెలడన్ పాత్రలు:
దాదాపుగా 2000సంవత్సరాల క్రితం చైనాలో తయారయిన ముదురు పచ్చరంగు పాత్రలు, నీలి పచ్చరంగు పాత్రలను సెలడన్ పాత్రలు అని అంటారు. పాత్రల అడుగు భాగాన ఉన్న రేఖలు వారి సృజనాత్మకతను తెలియచేస్తాయి. వాటిలో ముఖ్యంగా సింహాలను పోలిన బొమ్మలు, తీగలు, ఈతకొడుతున్న బాతులు మొదలగున చిత్రాలను చూడవచ్చు.
*ఈ మ్యూజియంలో చేతితో రాసిన ఖురాన్ ఉంటుంది, దీని మధ్యలో బంగారు గీతలను కూడా మనం చూడవచ్చు.
*ఇక్కడి గ్యాలరిీలలో పార్ళనాథుడు, వర్థమాన మహావీరుడు మరియు బుద్ధుడికి చెందిన విగ్రహాలు ఉన్నాయి.
*ఈ మ్యూజియం బయట 17 వ శతాబ్దానికి చెందిన జటప్రోలు సంస్థానం వారి కొయ్య రథం ఉంటుంది.

*కాకతీయ మండపం, అప్పట్లో నిజాంలు ఉపయోగించిన ఫిరంగులకు సంబంధించిన ఫిరంగుల గ్యాలరిీ, అజంతా గ్యాలరిీ ,వివిధ రకాలైన శాసనాలకి సంబంధించి మరియు హైదరాబాద్ హిస్టరీ పేరుతో ప్రత్యేక ఫోటో గ్యాలరిీ కలదు.
#State archeological museum.
#Nizam's. #Heritage.
#Doll's house.#Egypt mummy.
#Nampally.#Hyderabad.
#Adithyapakide. 





No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...