Sunday, September 17, 2017

Tribal museum by adithyapakide

మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన విజ్ఞాన భాండాగారంగా భాసిల్లుతోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 1963లో దీన్ని  ఏర్పాటు చేశారు. నాటి నుంచి పురాతన గిరిజన వస్తు సామగ్రిని సేకరిస్తూ వారి సంస్కృతి సంప్రదాయాలను వివరించేలా మ్యూజియంను ఏర్పాటు చేశారు. 1989లో జరిగిన జవహర్ లాల్  నెహ్రూ  గారి శతజయంతిని పురస్కరించుకొని ఈ సంగ్రహాలయానికి 'నెహ్రూ గిరిజన సంగ్రహాలయం'గా నామకరణం చేశారు. మాసాబ్ ట్యాంక్  సంక్షేమభవన్ ప్రాంగణంలో 2003లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ మ్యూజియానికి 3 అంతస్తుల సొంత భవనం ఏర్పాటు చేశారు.

ఇందులో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజన జీవనం, కళలకు సంబంధించిన పలు వస్తువులు వాటిని వివిధ విభాగాలలో గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో చెంచు ఫొటోగ్రఫీ, గిరిజన గుడిసెలు, గిరిజన జీవన, సంస్కృతి,  ప్రాంగణ ప్రదర్శన, గిరిజన కళా ప్రాంగణ విభాగాలున్నాయి. చెంచు గ్యాలరీలో గిరిజనులు కర్రతో అగ్ని పుట్టించే విధానం, గుడిసెల్లో వంట చేసుకోవడం, వేటాడే విధానం, భూమిలో నుంచి గడ్డలు తవ్వుకునే విధానం, వారి బాణాలు, తేనె సేకరణ పనిముట్లు, తేనె సేకరణ విధానాలు ప్రదర్శనకు ఉంచారు.

సంగ్రహాలయం మొదటి అంతస్తులో సవర గుడిసె, చెంచు గుడిసె, బంజారా గుడిసె, కోయ గుడిసె తదితర గిరిజన గుడిసెలను ప్రదర్శనకు ఉంచారు. గుడిసెల్లో గిరిజనుల జీవన విధానం ప్రస్ఫుటంగా కనిపించేలా పలుచోట్ల గిరిజనుల విగ్రహాలు, రకరకాల పనుల్లో నిమగ్నమైనట్లు ప్రతిమలను ఏర్పాటు చేశారు.
ఆ కాలంలో కుందేలు, చేపలు మరియు వివిధ రకాలైన పక్షులను వేటాడటానికి ఉపయెూగించే ఆయుధాలు మరియు నీటిని నిల్వ చేసుకోవడానికి అప్పట్లో వారు ఉపయెూగించిన వస్తువులు చూడవచ్చు.

 ఇక్కడి ఫోటో గ్యాలరీలలో  ప్రసిధ్ద గిరిజనుల  నృత్యమైన' థీమ్సా ' మరియు దానిలో 7 రకాలైన నృత్యాలైన గుండెరి థీమ్సా, బోడ్ థీమ్సా, గోడ్డి థీమ్సా, పాథర్ థీమ్సా, కుండా థీమ్సా, బాయా థీమ్సా, భాగ్ థీమ్సాలకు సంబంధించిన చిత్రాలను చూడవచ్చు.

 సాంస్కృతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలైన సన్నాయి, కిన్నెర, కిరీడి, థామర్,కొమ్ము, పానిర్,డోలు  మెుదలైన వాటిని చూడవచ్చు.  దృశ్య శ్రవణ విభాగంలో లఘుచిత్ర ప్రదర్శనశాలను (ఆడిటోరియం)  ఏర్పాటు చేశారు.

సందర్శన వేళలు:ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం -శనివారం ఆదివారం సెలవు.
ప్రవేశం ఉచితం.

Nehru Centenary Tribal Museum
Owaisi Pura, Masab Tank, Owaisi Pura, Masab Tank, Hyderabad, Telangana 500028
081796 84889

https://goo.gl/maps/bPZ8KYwUPRB2

#NehrucentenaryTribalmuseum.
#DSSbhavan.#Masabtank.
#Hyderabad.
#Adithyapakide.







No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...