Monday, September 11, 2017

ప్రజాకవి 'కాళోజి '



ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.స్వాతంత్య్ర సమరయోధుడు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి పోరాడిన ఉద్యమ కారుడు."పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది" అని తాను రాసిన విధంగానే దేశం కోసం జీవించిన నిస్వార్ధ దేశభక్తుడాయన.కాళోజీ  1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు.
బాల్యం మరియువిద్యాభ్యాసం:
బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లా కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండ గ్రామీణమడికొండలో స్థిరపడింది.ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ లాపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు.
1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రం లో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమం లో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది.
రచనలు:
కాళోజీ మరాఠీ , ఇంగ్లీషు , ఉర్దూ భాషలలో పండితుడు.
ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగు లకి అనువదించాడు.
1. అణా కథలు 
2. నా భారతదేశయాత్ర
3. పార్థివ వ్యయము
4. కాళోజి కథలు
5. నా గొడవ
6. జీవన గీత
7. తుదివిజయం మనది
8. తెలంగాణ ఉద్యమ కవితలు
9. ఇదీ నా గొడవ
10. బాపూ!బాపూ!!బాపూ!!!
గుర్తింపులు:
*విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని1992 లో స్వీకరించాడు. అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు.
*కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, కాళోజీ జన్మదినమైన సెప్టెంబరు 9 తేదిని తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ భాషాదినోత్సవం"గా ప్రకటించింది. వరంగల్లో నెలకొల్పిన వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ పేరుపెట్టబడింది.
*తెలంగాణా ప్రభుత్వం వరంగల్ లో మూడు ఎకరాల స్థలంలో  కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుచేసేందుకు పూనుకుంది.
* స్వాతంత్య్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం చే తామ్రపత్రం.
*బూర్గుల రామకృష్ణారావు స్మారక ప్రథమ అవార్డు.
*రామానేని ఫౌండేషన్ అవార్డు.
*గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు.
*మద్రాస్ కళాసాగర్ అవార్డు.
*గురజాడ పురస్కారం.

ఒక్క సిరా సుక్కతో లక్షల మెదళ్ళను కదిలించిన కలం ఆయనది.
కాళన్నా నీ కలానికి దండం !
కాళన్నా నీ కాళ్ళకు దండం !
#Padmavibhushan.
#Kalojinarayanarao.
#Adithyapakide.

No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...