Thursday, September 28, 2017

Adithyapakide

Check out adithya pakide (@adithya_pakide): https://twitter.com/adithya_pakide?s=09

Sunday, September 17, 2017

Adithyapakide




Tribal museum by adithyapakide

మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన విజ్ఞాన భాండాగారంగా భాసిల్లుతోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 1963లో దీన్ని  ఏర్పాటు చేశారు. నాటి నుంచి పురాతన గిరిజన వస్తు సామగ్రిని సేకరిస్తూ వారి సంస్కృతి సంప్రదాయాలను వివరించేలా మ్యూజియంను ఏర్పాటు చేశారు. 1989లో జరిగిన జవహర్ లాల్  నెహ్రూ  గారి శతజయంతిని పురస్కరించుకొని ఈ సంగ్రహాలయానికి 'నెహ్రూ గిరిజన సంగ్రహాలయం'గా నామకరణం చేశారు. మాసాబ్ ట్యాంక్  సంక్షేమభవన్ ప్రాంగణంలో 2003లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ మ్యూజియానికి 3 అంతస్తుల సొంత భవనం ఏర్పాటు చేశారు.

ఇందులో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజన జీవనం, కళలకు సంబంధించిన పలు వస్తువులు వాటిని వివిధ విభాగాలలో గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో చెంచు ఫొటోగ్రఫీ, గిరిజన గుడిసెలు, గిరిజన జీవన, సంస్కృతి,  ప్రాంగణ ప్రదర్శన, గిరిజన కళా ప్రాంగణ విభాగాలున్నాయి. చెంచు గ్యాలరీలో గిరిజనులు కర్రతో అగ్ని పుట్టించే విధానం, గుడిసెల్లో వంట చేసుకోవడం, వేటాడే విధానం, భూమిలో నుంచి గడ్డలు తవ్వుకునే విధానం, వారి బాణాలు, తేనె సేకరణ పనిముట్లు, తేనె సేకరణ విధానాలు ప్రదర్శనకు ఉంచారు.

సంగ్రహాలయం మొదటి అంతస్తులో సవర గుడిసె, చెంచు గుడిసె, బంజారా గుడిసె, కోయ గుడిసె తదితర గిరిజన గుడిసెలను ప్రదర్శనకు ఉంచారు. గుడిసెల్లో గిరిజనుల జీవన విధానం ప్రస్ఫుటంగా కనిపించేలా పలుచోట్ల గిరిజనుల విగ్రహాలు, రకరకాల పనుల్లో నిమగ్నమైనట్లు ప్రతిమలను ఏర్పాటు చేశారు.
ఆ కాలంలో కుందేలు, చేపలు మరియు వివిధ రకాలైన పక్షులను వేటాడటానికి ఉపయెూగించే ఆయుధాలు మరియు నీటిని నిల్వ చేసుకోవడానికి అప్పట్లో వారు ఉపయెూగించిన వస్తువులు చూడవచ్చు.

 ఇక్కడి ఫోటో గ్యాలరీలలో  ప్రసిధ్ద గిరిజనుల  నృత్యమైన' థీమ్సా ' మరియు దానిలో 7 రకాలైన నృత్యాలైన గుండెరి థీమ్సా, బోడ్ థీమ్సా, గోడ్డి థీమ్సా, పాథర్ థీమ్సా, కుండా థీమ్సా, బాయా థీమ్సా, భాగ్ థీమ్సాలకు సంబంధించిన చిత్రాలను చూడవచ్చు.

 సాంస్కృతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలైన సన్నాయి, కిన్నెర, కిరీడి, థామర్,కొమ్ము, పానిర్,డోలు  మెుదలైన వాటిని చూడవచ్చు.  దృశ్య శ్రవణ విభాగంలో లఘుచిత్ర ప్రదర్శనశాలను (ఆడిటోరియం)  ఏర్పాటు చేశారు.

సందర్శన వేళలు:ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం -శనివారం ఆదివారం సెలవు.
ప్రవేశం ఉచితం.

Nehru Centenary Tribal Museum
Owaisi Pura, Masab Tank, Owaisi Pura, Masab Tank, Hyderabad, Telangana 500028
081796 84889

https://goo.gl/maps/bPZ8KYwUPRB2

#NehrucentenaryTribalmuseum.
#DSSbhavan.#Masabtank.
#Hyderabad.
#Adithyapakide.







Friday, September 15, 2017

షోయబుల్లా ఖాన్ - by adithyapakide

“ప్రతి మనిషికి మరణం తప్పదు.. చావు నుండి తప్పించుకోలేం.. అయితే ఆ మరణం ఒక లక్ష్యం కోసం జరగాలి దేశం కోసం మరణించడానికి నేను సంతోషిస్తాను” - షోయబుల్లా ఖాన్
హైదరాబాద్ సంస్థానాన్ని నిరంకుశుడైన ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలిస్తున్న రోజులవి.. మధ్య యుగాల నాటి ప్యూడల్ పాలన.. సంస్థానంలో పౌర హక్కులు లేవు.. మెజారిటీ ప్రజల మతం, విద్య, సంస్కృతి, సాంప్రదాయాలంటే పాలకులకు ఏమాత్రం గౌరవం లేదు.. నిజాం నవాబు ప్రోత్సాహంతో  రజాకార్ల ఆడగాలు మరోవైపు.. పగలంతా నిజాం పాలన సాగితే, రాత్రి రజాకార్లు గ్రామాలపై పడేవారు.. అందిన కాడికి దోచుకోవడం, మహిళలను చెరచడం, అడ్డం వచ్చిన వారిని చంపేయడం, ఇళ్లు, ఆస్తులు తగుల పెట్టడం నిత్యకృత్యంగా మారింది.. 
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ ఇంకా విముక్తి కాలేదు.. బ్రిటిష్ వారి సామంతుడు నిజాం తాను స్వతంత్రుడినని ప్రకటించుకున్నారు.. సంస్థాన ప్రజలంతా భారత దేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నారు.. ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులపై నిర్భందం పెరిగింది.. నిజాం నవాబుకు అండగా నిలిచిన రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ మరింత రెచ్చిపోయాడు  అనల్ మాలిక్ నినాదంతో  హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి తన ఆగడాను ఉదృతం చేశారు రజాకార్లు..
ఇలాంటి వేళ గర్జించిందో ముస్లిం జర్నలిస్టు కలం.. నిజాం పాలన, నిజాం దురాగతాలపై షోయబుల్లాఖాన్ తన ‘ఇమ్రోజ్’ పత్రిక ద్వారా నిప్పులు చెరిగాడు.. 1920లో వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌లో జన్మించిన షోయబుల్లాఖాన్ ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్ని జర్నలిజం వృత్తిని ఎన్నుకున్నాడు.. ముందుముల నరసింగరావు సంపాదకత్వంలోని జాతీయవాద పత్రిక ‘రయ్యత్’లో చేరాడు.. రజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాసేవాడు.. దీంతో ప్రభుత్వం రయ్యత్ ను నిషేధించింది..
ఇంతటితో ఆగని షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ అనే సొంత పత్రికను ప్రారంభించాడు.. మరింత దూకుడుగా నిజాం, రజాకార్లను ఎండగట్టాడు.. ఈ ధిక్కార స్వరాన్ని సహించలేకపోయాడు కాశిం రజ్వీ.. అందునా ఇక ముస్లిం ఇలా అక్షరాయుధాలు ఎక్కుపెట్టడం జీర్ణించుకోలేకపోయాడు..  ఇలాగైతే ప్రాణాలకు ముప్పు అని షోయబుల్లాకు బెదిరింపులు వచ్చాయి..  ‘‘సత్యాన్వేషణలో మరణిస్తే అది గర్వించదగిన విషయం’’ అంటూ నిజాం షోయబుల్లాఖాన్‌ లేఖ రాశాడు..
1948 ఆగస్టు 21 అర్ధరాత్రి.. తెల్లవారితే 22.. కాచీగూడలోని ఇమ్రోజ్ కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరాడె షోయబుల్లా.. లింగంపల్లి చౌరస్తా దగ్గర కత్తులు, తుపాకులతో రజాకార్లు దాడి చేశారు.. నిజాలను నిర్భయంగా రాసిన షోయబుల్లా అమరుడైపోయాడు.. షోయబుల్లా ప్రాణ త్యాగం వృధాగా పోలేదు.. మరికొద్ది హైదరాబాద్ సంస్థానం విముక్తమై భారత దేశంలో విలీనమైంది..
జాతీయవాద జర్నలిస్టు షోయబుల్లాఖాన్ స్మృతిలో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖ ప్రతి ఏటా అత్యధిక మార్కులు సాధించిన జర్నలిస్టుకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.. ఈనాడు దేశంలో మత తీవ్రవాదం, విద్రోహ కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో షోయబుల్లా ఖాన్ లాంటి జాతీయవాద జర్నలిస్టు అవసరం చాలా ఉంది.. షోయబుల్లా ఖాన్ అమర్ హై..
#Nizams.
#Shoyabullakhan.
##Adithyapakide.

Thursday, September 14, 2017

PV Narasimaharao by adithyapakide.


పీవీ నరసింహారావు:

బాల్యం:

తెలంగాణ లోని వరంగల్ జిల్లా , నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు  . స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి , శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.

రాష్ట్ర రాజకీయాల్లో పీవీ:

1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీధి ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

ముఖ్యమంత్రిగా పీవీ:

ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ , హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు .ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా , రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు .పీవీ దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య ఆయన గురించి వ్రాశాడు. శాసనసభలో, లోక్ సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచాడు.
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేదాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.

కేంద్ర రాజకీయాల్లో పీవీ:

తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీ కి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.


ప్రధానమంత్రిగా పీవీ:

ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి
ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్ సభ  నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ , గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. మరొకవైపు
బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉంది.

సాహితీ కృషి:

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు , హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు.

మరణం
తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 , డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
#Pamulaparthi Venkata Narasimaharao.
#Adithyapakide.







Tuesday, September 12, 2017

స్టేట్ఆర్కియాలజీ మ్యూజియం -Adithyapakide

స్టేట్ఆర్కియాలజీ మ్యూజియం
తవ్వకాలలో బయటపడిన విలువైన వస్తువులతో ఏర్పడిందే స్టేట్ ఆర్కియాలజీ  మ్యూజియం. ఇది నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్స్ లో ఉంది.ఇక్కడ కనిపించే ప్రతీ వస్తువూ చారిత్రాత్మకమైనదే.వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ మ్యూజియం భవంతిని 7వ నిజాం నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కట్టించాడు. ఇది ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ ని పోలి ఉంటుంది.మొదట్లో ఈ భవంతి  డాల్స్ హౌస్ గా పిలవబడేది. ఈ   భవంతిలో ముఖ్యంగా రెండు భాగాలున్నాయి. అవి
  1.అర్థచంద్రాకారపు భవంతి.
   2.ప్రధాన భవంతి.
ఈ రెండింటినీ ఆకాశం నుండి చూస్తే చుక్కల మధ్య నెలవంకలా ఇది కనిపిస్తుంది.
ఈ మ్యూజియంలో రాష్ట్ర వ్యాప్తంగా భౌద్ధ,జైన మతాలకు చెందిన వివిధ రకాలైన వస్తువులు, అవశేషాలు, రాతి,కాంస్య, ఇత్తడి విగ్రహాలు ప్రత్యేక గ్యాలరిీలలో మనం చూడవచ్చు. ఈజిప్ట్ మమ్మీ నుండి బుద్ధుడి అస్థికల వరకూ ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయి.
మ్యూజియం లోని ప్రత్యేక ఆకర్షణలు:
*ఈజిప్టు మమ్మీ:
ఇక్కడి మ్యూజియంలో ఉన్న ఈజిప్టు మమ్మీ 2500సంవత్సరాల క్రితం నాటిదనీ, ఈజిప్టు దేశపు 6వ ఫారో యొక్క కుమార్తెదని భావిస్తారు. దీనిని 6వ నిజాం యొక్క అల్లుడైన నవాబ్జంగ్ అప్పట్లోనే 1000 పౌండ్లకు కొని 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు బహుమతిగా ఇచ్చాడు.
మరణించిన వారి పట్ల ఈజిప్షియన్లకు ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. అదేమిటంటే వారు మరణించిన తర్వాత వారి ఆత్మలు అస్తిత్వాన్ని పొందడం కోసం వీలుగా శవాలను భద్రపరచడం.ఆ తరువాత ఇది ఒక ఆనవాయితీగా మారింది. ఈ ప్రక్రియను 'మమ్మీఫికేషన్ ' అని అంటారు.
*బిద్రీ పాత్రలు:
భారతదేశపు సాంప్రదాయక లోహ కళల్లో ఒకటైనది బిద్రీ పాత్ర కళ. లోహంలో మరికొన్ని లోహాలను అందంగా పొదగడమనే కళ ఇందులో దాగి ఉంటుంది.
*సెలడన్ పాత్రలు:
దాదాపుగా 2000సంవత్సరాల క్రితం చైనాలో తయారయిన ముదురు పచ్చరంగు పాత్రలు, నీలి పచ్చరంగు పాత్రలను సెలడన్ పాత్రలు అని అంటారు. పాత్రల అడుగు భాగాన ఉన్న రేఖలు వారి సృజనాత్మకతను తెలియచేస్తాయి. వాటిలో ముఖ్యంగా సింహాలను పోలిన బొమ్మలు, తీగలు, ఈతకొడుతున్న బాతులు మొదలగున చిత్రాలను చూడవచ్చు.
*ఈ మ్యూజియంలో చేతితో రాసిన ఖురాన్ ఉంటుంది, దీని మధ్యలో బంగారు గీతలను కూడా మనం చూడవచ్చు.
*ఇక్కడి గ్యాలరిీలలో పార్ళనాథుడు, వర్థమాన మహావీరుడు మరియు బుద్ధుడికి చెందిన విగ్రహాలు ఉన్నాయి.
*ఈ మ్యూజియం బయట 17 వ శతాబ్దానికి చెందిన జటప్రోలు సంస్థానం వారి కొయ్య రథం ఉంటుంది.

*కాకతీయ మండపం, అప్పట్లో నిజాంలు ఉపయోగించిన ఫిరంగులకు సంబంధించిన ఫిరంగుల గ్యాలరిీ, అజంతా గ్యాలరిీ ,వివిధ రకాలైన శాసనాలకి సంబంధించి మరియు హైదరాబాద్ హిస్టరీ పేరుతో ప్రత్యేక ఫోటో గ్యాలరిీ కలదు.
#State archeological museum.
#Nizam's. #Heritage.
#Doll's house.#Egypt mummy.
#Nampally.#Hyderabad.
#Adithyapakide. 





Salarjung Museum -adithyapakide

 సాలార్ జంగ్ మ్యూజియం.

హైదరాబాద్ యొక్క సాలార్ జంగ్ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా  దేశాల యొక్క కళాత్మక వస్తువుల భాండాగారం. ఈ సేకరణ ప్రముఖంగా సాలార్ జంగ్ III సేకరించారు. 1914 లో, సాలార్జంగ్ తర్వాత  నిజాం VII, నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్, సేకరించారు. నలభై సంవత్సరాల కాలంలో అతనికి ద్వారా సేకరించిన విలువైన మరియు అరుదైన కళ వస్తువులు, కళ వంటి చాలా అరుదైన ముక్కలు సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నాయి.
సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ఉంది. వివిధ నాగరికతలు చెందిన సేకరణలు మరియు 1వ శతాబ్దం చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి.

* 1951 డిసెంబరు 16 న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడింది. హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ IIIగా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II " మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I "కు చెందినవి. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి.

*సేకరణలు.

-ఇందులో "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" ప్రత్యేకంగా చెప్పుకోచెప్పుకోదగినవి.

- జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.

-సాలార్ జంగ్ కు చెందిన మహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారాలు మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.

-సేకరణల్లో గ్రంథాలు, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి.

సందర్శన సమయాలు:

ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. (శుక్రవారం సెలవు).
#Salarjungmuseum.
#Nizam's heitage.
##Afzalgunj #Hyderabad.
##Adithyapakide.

'చార్ మీనార్'- by adithyapakide


చార్మినార్లోని 'చార్'ల అద్భుతం.
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.

ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్లోని చార్కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్ల కారణంగానే చార్మినార్కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్లకి, మినార్లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్లకి, మినార్లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్లు ఉన్నాయి. ప్రతి మినార్లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్ అందమైన డోమ్ ఆకారంలో ఉంటుంది. చార్మినార్ ఆర్చ్ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి.
#Charminar.#Heritage.
#Quitubshahi's.
#Hyderabad.
#Adithyapakide.

Saroornagar lake -by adithyapakide

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం _ by adithyapakide


8 సెప్టెంబర్ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (8 Sep International Literacy Day)
ప్రపంచం‌లో విద్యావ్యాప్తికోసం యునెస్కో తొలిసారిగా 1946లో సెప్టెంబరు 8వ తేదీన ఇరాన్‌లోని టెహ్‌రాన్‌లో సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని అదేరోజున నిర్వహించుకోవాలని యునెస్కో 1965లో సూచించినమేరకు 1966సం|| నుండి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. వయోజనులు, సంఘం, సమాజం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని నొక్కి చెప్పడమే ఈ ఉత్సవాల ఉద్దేశ్యం.
విద్య పై గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రతీ ఐదుగురు పురుషుల్లో ఒకరు మరియు మూడింట రెండు వంతుల మహిళలు నిరక్షరాస్యులుగా తేల్చింది. కొందరికి అక్షరాస్యత నైపుణ్యాలు అత్యల్పంగానూ, కొందరు పిల్లలు ఇప్పటికీ పాఠశాలకు బయట ఉండటము మరియు మరికొంతమంది అప్పుడప్పుడూ పాఠశాలకు హాజరౌతున్నారు. దక్షిణ మరియు పశ్చిమ ఆసియాలలో వయోజన అక్షరాస్యత రేటు అత్యల్పంగా 58.6% గాఉంది. అక్షరాస్యత రేటు మరీ తక్కువైన దేశాలు బుర్కినా ఫాసో, మాలి మరియు నైజర్‌లు.
ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతా సూచి అభివృధ్ధికోసం ప్రోత్సహించడంకోసం – ప్రజాబాహుళ్యం‌లో అక్షరాస్యతపట్ల, లిఖితాక్షరాలకుగల విశేషమైన విలువలపట్ల చెతన్యంకల్గించి అక్షరాస్యతా సమాజంవైపు ప్రోత్సహించడం కోసం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని విశేషంగా నిర్వహించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పలువురు మేధావులు, దాతృత్వ సంస్థలు, ప్రపంచాభివృధ్ధి పరిశోధనా కెంద్రం, రోటరీ ఇంటర్నేషనల్,మొంట్‌బ్లాక్, జాతీయ అక్షరాస్యతా సంస్థలు ఈ ఉద్యమం‌లో భాగస్వాములౌతున్నాయి.
అక్షరాస్యత వైపుగా సమాజం దృష్టిని ప్రోత్సహించడం, సామాజిక , మానవ అభివృద్ధికోసం వారు తమహక్కులను తెలుసుకోవటం కొరకు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంబరాలు నిర్వహించుకుంటాము. జీవితానికి ఆహారమెంత అవసరమో, విజయం సాధించడానికి అక్షరాస్యత అంతే ముఖ్యం. అక్షరాస్యతతో శిశుమరణాలు తగ్గించడం, జనాభా నియంత్రణ, లింగసమానత్వం సాధించడంద్వారా కుటుంబహోదా తద్వారా అంతర్జాతీయస్థాయిలో దేశంహోదాను పెరగడానికి దోహదపడుతుంది. నిరంతర విద్య పొందేందుకు ప్రజలను ప్రోత్సహిస్తే వారు కుటుంబం, సమాజంతోపాటు దేశంపట్ల తమబాధ్యతలను అర్థంచేసుకుంటారు.
కాలానుగుణంగా అక్షరాస్యతకు నిర్వచనాలు మరింత స్పష్టతదిశగా పయనిస్తున్నాయి.
- ప్రారంభం‌లో 3 Rs రీడింగ్, రైటింగ్, అర్ధిమెటిక్ (గణితం) గా వివరంచేవారు
- తదుపరి కాలం‌లో 4 Rs – పైమూడింటికి ఆదనంగా ‘ కంప్యూటర్ లిటరసీ”ని చేర్చారు.
- ఇటీవలి కాలం‌లో అక్షరాస్యత అంటే 3 Rs 4 Rs మాత్రమే కావనీ, బౌథ్ధిక, శారీరక, అధ్యాత్మిక/ కళాతత్త్వ వికాసాలతో పాటు పర్యావరణ, జీవవైవిధ్యాల పరిరక్షణలు వాటి ఆచరణ కూడా ఉంటుందని విద్యావేత్తలు, తత్త్వవేత్తలు భావిస్తున్నారు.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేడుకల అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి కొన్ని వ్యూహాత్మక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి సంవత్సరానికొక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ప్రస్తుత సంవత్సరానికి 2017 “ అక్షరాస్యత- అంకసమాజం (Literacy in the Digital World)” గా నిర్దేశించారు.
పౌరుల ప్రమేయంలేకుండా సమాజం‌ అన్ని పార్శ్వాల్లోకి డిజిటలైజేషన్ విస్తరించింది. జనాభా గణనలో అక్షరాస్యతతోబాటు అంకఅక్షరాస్యతని సైతం నమోదు చేయడం అవసరం కాబొతూంది.
మన జీవనం, వృత్తి, అధ్యయనం, సామాజికీకరణవంటివాటితోపాటు సమాచార సేకరణ, నిర్వహణ, సామాజిక సేవ, పారిశ్రామికోత్పత్తులతోపాటు మనం పనిచేసే విధానాన్నే మార్చేసింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం‌ లేకపోతే డిజిటల్ లేదా కంప్యూటర్ ఇల్లిటరేట్’గా పరిగణించబడటంతోపాటు తన వృత్తి, జీవన వ్యవహారాలలో వెనుకబడిపోతాడు.
అక్షరాస్యతోపాటు అంక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు నేటి జీవితానికి అత్యవసరమైనవి. నేటి ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఈదిశగా కృషిచేయాలి.
#World literacy day.
##September 8.
##Adithyapakide.

Monday, September 11, 2017

Adithyapakide


Adithyapakide


Adithyapakide






Ccmb

CSIR,CCMB.

  దేశ పురోగతి అనేది అక్కడి పరిశోధన సంస్థల పైన ఆధారపడుతుంది.ఆయా సంస్థల ఆవిష్కరణల ఫలితాల వలనే సహజవనరుల వినియోగం మరియు కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారానే దేశాభివ్రుధ్ధి జరుగుతుంది.ఈ క్రమంలో ఏర్పడిందే 'సీఎస్ఐఆర్ '.1942 సెప్టెంబర్ 26న సీఎస్ఐఆర్ ను  ఏర్పాటుచేశారు.ఈ సంస్థ ఏర్పాటు చేసి 75  సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా విద్యార్థులకు సెప్టెంబర్ 1నుండి 6 వరకూ ఉచిత ప్రదర్శన ను ఏర్పాటుచేశారు.

ప్రదర్శన లో ముఖ్యమైనవి:

   వ్యర్థాల నుండి పెట్రో కెమికల్స్ తయారీ, పారిశ్రామిక వ్యర్థ జలాల శుధ్ధి,CSIR-800 సాంబమషూరి వరి వంగడం,   సునామీలు భూకంపాలు ఏర్పడే విధానం, భూకంప తీవ్రత నమెూదు,వ్యర్థ పదార్థాలనుండి బయెూగ్యాస్ ఉత్పత్తి, సంచారిత నీటి శుధ్ధి ప్రక్రియా విధానం,భూమిలోపల ఉన్న శిలాజ ఇంధనాల గుర్తింపు మెుదలైనవి ముఖ్యమైనవి.

ప్రదర్శనలో పాల్గొంటున్న కేంద్ర సంస్థలు:

IICT-hyd,CCMB-hyd,NGRI-hyd,CRRI-delhi,CECRI-tamilanadu,AMPRI-Bhopal,CMPRI-bhopal,CMERI-west bengal,CSMCRI-Gujarath,IIP-Uttarakhand ,NCL-Maharashtra ,NML-Jarkhand,NBRI-Uttarapradesh .

సందర్శన సమయం:
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు.
(September 1 to 6only)ప్రవేశం ఉచితం.

Centre for Cellular and Molecular Biology
Uppal Road, Habsiguda, IICT Colony, Tarnaka, Hyderabad, Telangana 500007
040 2716 0222

https://goo.gl/maps/rpbX1RQbDLu.

#CSIR#CCMB.
##PLATINUMJUBILEECELEBRTIONS.
#HABSIGUDA.#HYDERABAD.
#adithyapakide.

ప్రజాకవి 'కాళోజి '


Adithyapakide



Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...