Thursday, November 16, 2017

Dimsa dance by adithyapakide

 థీమ్సా నృత్యం:
సాధారణ గిరిజన నృత్యాలు దైలారాధనతో పాటుగా ఉల్లాస భరిత వాతావరణానికి పరిమితమవడం కనిపిస్తుంది.కానీ కోయ నృత్యాలు ఈ రెండింటితో పాటూ కోయల జీవితంలో భాగం కావడం విశేషం. కోయల పుట్టుక నుండి మరణం వరకూ జరిగే అన్ని కార్యక్రమాలలో మద్య మాంసాలతో పాటుగా నృత్యం తప్పనిసరి.
కోయ నృత్యంలో స్త్రీలకు,పురుషులకూ మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది.పురుషులు ప్రత్యేక వస్త్రధారణ తో డోళ్ళను లయబద్దంగా వాయిస్తూ అడుగులు వేసుకంటూ నృత్యం చేస్తే, స్త్రీలు తమ చీరలను నిత్య జీవితంలో మాదిరిగానే ధరించి కొప్పులో పూలు పెట్టుకుని నృత్యం చేయడం జరుగుతుంది.ఒక్కోసారి ఇది గేయ సహితంగా మరియు వాద్య రహితంగా ప్రదర్శించబడుతుంది.కోయల స్త్రీ నృత్యం ఇతర గిరిజన తెగల నృత్యాలతో సారూప్యతను కలిగి ఉంటుంది.
ఈ నృత్యంలో వాద్య సహకారాలూ లేకపోయినా కూడా లయబద్దంగా సాగే వారి అడుగులే వారి గేయాలకు లయను అందిస్తూ వాద్యం లేని కొరతను తీరుస్తాయని చెప్పవచ్చును.నృత్యం చేసేటపుడు ఒకరి అరచేతిని మరొకరు లేదా ఒకరి నడుమును మరొకరూ పట్టుకుని నృత్యం చేస్తారు అడుగులు వేసే పద్దతిలో రెండు కాళ్ళతో అంటే కుడి కాలితో ఎడమవైపు తడుతూ కుడివైపుకు జరుగుతూ వలయారంగా నృత్యం చేస్తారు. ఒక్కోసారి వీరు ముందుకు సాగే పద్ధతి పాము నడకవలే కనబడుతుంది కానీ వీరు చాలి వరకూ వలయాకారానికే ప్రాముఖ్యతను ఇస్తారు.మెుదటి స్త్రీ అడుగుల క్రమాన్నే దాదాపుగా అందరూ పాటించడం జరుగుతుంది. ఈ అడుగుర్లో కూడా ఒక్కొక్క అడుగునూ గాలిలో లేపుతూ,రెండొ అడుగును వెనకకు తడుతూ నృత్యం చేయడమనే రకరకాల విన్యాసాలు కనిపిస్తాయి.
నడి వయస్సు వారు యువతులు నృత్యం చేస్తే అడుగుల విన్యాసాలు ఆకర్షణీయంగా కనబడుతాయి. ఈ సందర్భానికి సంబంధించిన గేయాన్ని బృందంలో ఒకరు పాడితే దానిని మిగిలిన వారు అనుకరిస్తారు.
ఇతర గిరిజనులలో నృత్యం అనేది ఇటు ఆరాధన అటు ఆనందం మేరకు ప్రదర్శించబడితే కోయలలో మాత్రం ఈ రెండింటితో పాటూ వివాహ వేడుకలలొ ఆచారం కావడం అదనమే కాక నృత్య పరంగా కోయవారికి ఉన్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...