Saturday, December 30, 2017

Paigah tombs by adithyapakide

 Paigah tombs:


The paigah tombs are locate Pisabandla on the road to santhosh nagar colony from Mirjumla Tank.It represent final resting places of sev generations of the paigah n including Asman Jah,Viqar-uUmara and shams Ul Umara.Constructed in 1880, the tombs eith designs,are magnificent structures with stucco work,reflecting Deccani,Mughal,Greek,Persia Jahi and Rajasthani styles architecture.


Paigah Tombs Qalender Nagar Rd, Sant Kanchan Bagh, Owaisi Nagar, Hasnabad Nagar, Hyderabad, Telangana 500059 1 6464


https://goo.gl/maps/xSQsNEZ7oN92

##Adithyapakide




Thursday, November 16, 2017

Padmakshi temple clicks by adithyapakide

Adithyapakide #AP

#Adithyapakide

#AP

Adithyapakide

Adithyapakide

#AP

Rock paintings by adithyapakide

శిలాయుగపు వర్ణ చిత్రాలు (ROCK PAINTINGS)
ఉన్నటువంటి ప్రదేశం:
శిలాయుగపు వర్ణ చిత్రాలు వరంగల్ కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలం లోని తిరుమలగిరి గ్రామానికి సమీ తూర్పు దిశగా ఉన్న పాండవుల గుట్ట కొండచరియ పైన 1990 లో పురావస్తుశాఖ కనుగొన్నారు.
శిలాయుగపు వర్ణ చిత్రాలు ఈ స్థలంలో గుండు,ముంగిస బండ,ఎదురు పాండవులు,పంచ పాండవులు,కుం గుట్ట అని పిలవబడు ప్రత్యేక ప్రదేశాల గోడలపైన చిత్రించబడినవి.
ఈ శిలాయుగపు వర్ణ చిత్రాలలో నెమలి,జింక,కోతి,చేప,బల్లి,ముంగిస,సీతాకో పశువులు, హస్త ముద్రికలు మెుదలై మూడు అంగుళాల నుండి వాటి ఆకారమ ఎంతనో అంత పెద్దవిగా చిత్రించబడినవి.
ఉపయెూగించిన రంగులు:
ఈ వర్ణ చిత్రాలను వేయడంలో తెలుపు,ఎరుపు,పసుపుపచ్చ, కపిల వర్ణము మెుదలైన ఖనిజ రంగులను ఆదిమానవులు ఉపయెూగించారు
Pandavula Guhalu Ramannaguda, Telan 506345 081256 03070

Dimsa dance by adithyapakide

 థీమ్సా నృత్యం:
సాధారణ గిరిజన నృత్యాలు దైలారాధనతో పాటుగా ఉల్లాస భరిత వాతావరణానికి పరిమితమవడం కనిపిస్తుంది.కానీ కోయ నృత్యాలు ఈ రెండింటితో పాటూ కోయల జీవితంలో భాగం కావడం విశేషం. కోయల పుట్టుక నుండి మరణం వరకూ జరిగే అన్ని కార్యక్రమాలలో మద్య మాంసాలతో పాటుగా నృత్యం తప్పనిసరి.
కోయ నృత్యంలో స్త్రీలకు,పురుషులకూ మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది.పురుషులు ప్రత్యేక వస్త్రధారణ తో డోళ్ళను లయబద్దంగా వాయిస్తూ అడుగులు వేసుకంటూ నృత్యం చేస్తే, స్త్రీలు తమ చీరలను నిత్య జీవితంలో మాదిరిగానే ధరించి కొప్పులో పూలు పెట్టుకుని నృత్యం చేయడం జరుగుతుంది.ఒక్కోసారి ఇది గేయ సహితంగా మరియు వాద్య రహితంగా ప్రదర్శించబడుతుంది.కోయల స్త్రీ నృత్యం ఇతర గిరిజన తెగల నృత్యాలతో సారూప్యతను కలిగి ఉంటుంది.
ఈ నృత్యంలో వాద్య సహకారాలూ లేకపోయినా కూడా లయబద్దంగా సాగే వారి అడుగులే వారి గేయాలకు లయను అందిస్తూ వాద్యం లేని కొరతను తీరుస్తాయని చెప్పవచ్చును.నృత్యం చేసేటపుడు ఒకరి అరచేతిని మరొకరు లేదా ఒకరి నడుమును మరొకరూ పట్టుకుని నృత్యం చేస్తారు అడుగులు వేసే పద్దతిలో రెండు కాళ్ళతో అంటే కుడి కాలితో ఎడమవైపు తడుతూ కుడివైపుకు జరుగుతూ వలయారంగా నృత్యం చేస్తారు. ఒక్కోసారి వీరు ముందుకు సాగే పద్ధతి పాము నడకవలే కనబడుతుంది కానీ వీరు చాలి వరకూ వలయాకారానికే ప్రాముఖ్యతను ఇస్తారు.మెుదటి స్త్రీ అడుగుల క్రమాన్నే దాదాపుగా అందరూ పాటించడం జరుగుతుంది. ఈ అడుగుర్లో కూడా ఒక్కొక్క అడుగునూ గాలిలో లేపుతూ,రెండొ అడుగును వెనకకు తడుతూ నృత్యం చేయడమనే రకరకాల విన్యాసాలు కనిపిస్తాయి.
నడి వయస్సు వారు యువతులు నృత్యం చేస్తే అడుగుల విన్యాసాలు ఆకర్షణీయంగా కనబడుతాయి. ఈ సందర్భానికి సంబంధించిన గేయాన్ని బృందంలో ఒకరు పాడితే దానిని మిగిలిన వారు అనుకరిస్తారు.
ఇతర గిరిజనులలో నృత్యం అనేది ఇటు ఆరాధన అటు ఆనందం మేరకు ప్రదర్శించబడితే కోయలలో మాత్రం ఈ రెండింటితో పాటూ వివాహ వేడుకలలొ ఆచారం కావడం అదనమే కాక నృత్య పరంగా కోయవారికి ఉన్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Paigah tombs by adithyapakide

Paigah Tombs:
The paigah tombs are located at Pisabandla on the road to santhosh nagar colony from the Mirjumla Tank.It represent the final resting places of several generations of the paigah nobles, including Asman Jah,Viqar-ul-Umara and shams Ul Umara.Constructed between 1787 and 1880s, the tombs eith unique designs,are magnificent structures with stucco work,reflecting Deccani,Mughal,Greek,Persian,Asaf Jahi and Rajasthani styles of architecture.
Timings:
All days of the week except Friday 10:00 AM - 5:00 PM.
Paigah Tombs Qalender Nagar Rd, Santosh Nagar, Kanchan Bagh, Owaisi Nagar, Hasnabad, Santosh Nagar, Hyderabad, Telangana 500059 1800 4254 6464

కోయ గిరిజన పంచాయతీ విధానం

 కోయ గిరిజనుల పంచాయతీ విధానం:
కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యే న్యాయ విధానం అమలులో ఉండేది.వీరి స వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీ కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆ వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటా తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తు ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీ వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య క మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా,నష్టం తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్ విచారిస్తారు.
వ్యక్తులు -ప్రాధాన్యత:
పంచాయతీ పరిష్కారానికి గూడెంకు సంబ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.వీరి గూడెంకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉండి వారు ఆయా గో ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.వారిలో
1.పటేల్. 2.పిన పెద్ద. 3.పూజారి. 4.ఏపారి.
1.పటేల్: ఇతడే గూడెంకు సంబంధించి పదవి సాధారణంగా ఆ గూడాన్ని ఏర్పాటు చేసినపుడు ఉన్న మెుదటి వ్యక్తికి సంక్రమిస్తుంది. గిరిజనులు ఎక్కువ చోట నివాసం చేయరూ.ఇలా ఒకచోటి నుండి చోటికి వెళ్ళాళంటే పటేల్ సలహా మరియు అ అవసరం.విచారణ అనంతరం తుది తీర్ప పటేల్ వెళ్ళడిస్తాడు.క్రమంగా వంశ పారప ఆ కుటంబానికి చెందిన వ్యక్తులు పటే వ్యవహరించే అధికారం సిధ్దిస్తుంది.
2.పిన పెద్ద: పటేల్ తర్వాత రెండవ ప్రాధాన్ కలిగిన వ్యక్తి పిన పెద్ద. ఇతను కూడా గ ఏర్పడినపుడు ఉన్న ప్రధాన వ్యక్తి.ప విధానంలో ఇతని తీర్పు కూడా కీలకమైనదే.
3.పూజారి:గూడెంకు సంబంధించిన కుటుంబాలకు మరియు ఆ గూడెంలోని దేవతలకు పూజిస్తూ పూజరిగా పిలవబడతాడు.ఇతను కూడా వంశపారం విధులను కొనసాగించే హక్కు ఉంది.గూ సంబంధించిన సామూహిక పూజా కార్యక్రమాలు,మంచిరోజు,ముహూర్త నిర్ణయించేది పూజారే.కేవలం పూజలకే గూడెంకు సంబంధించిన పంచాయతీలో వ్యక్తిగా ఇతనికి ప్రాధాన్యత ఇస్తారు.
4.ఏపారి:గూడెంకు సంబంధించిన సామ పనులు మరియు సమాచారాన్ని ప్రజలంద చేరవేయడం ఇతని ప్రధాన కర్తవ్యం. ప జరిగే సమయంలో అందరినీ పిలుచుకురా మరియు కుల పెద్దలు చెప్పిన విధులన నిర్వర్తిస్తుంటాడు.
పంచాయతీ రకాలు:
గతంలో భూ ఆక్రమణ, అక్రమ సంబంధ లాంటివి పెద్దల దృష్టికి తీసుకువచ్చి ప ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో పరిష్కార జరిపేవారు.ఇలా తిరిగి జరగకుండా ఆ తెగకు సంబంధించిన ప్రజలు జాగ్రత్త పడేవారు.పంచాయతీలో ప్రధానంగా తిట్టుకోవడం,కొట్టుకోవడం,ఆలూమగల పంచాయతీ, దొంగతనాలు,ఆక్రమణలు,భ తగదాలు,అత్తాకోడళ్ళ పంచాయతీ, ఆస్తి తగాదాలు,విడాకులు,అక్రమసంబంధం, వంటి ఎన్నో రకాలైన పంచాయతీలు ఉంటా ఇందులో చాలా వరకూ ఆవేశంతో కూడుక చేసుకునే పంచాయతీలే ఉంటాయి.
శిక్షలు-విముక్తి చర్యలు:
తెగకు మచ్చ తెచ్చే విధంగా కట్టుబాట్లన అధిగమించినపుడు వెలివేయడం తీవ్ర శిక్ష.అటువంటివారికి ఇటు గూడెం ను కాకుండా పొరుగు గూడాలకు కూడా విష తెలియడం వల్ల వీరిని దరికి రానివ్వరు.శిక్ అనుభవించేవారు నీళ్లు ముట్టరాదు,పండుగల్లో పాలుపంచుకోరాదు.వారికి ఆపద వస్తే పలకరించరు.ఇలాంటి కఠిన నియమాలు అమలుచేయడం వల్ల కొన్ని రోజుల్లోనే త గ్రహించి తిరిగి కులంలో కలవడానికి పెద్ద అంగీకారం తీసుకుని శిక్షల నుండి వి పొందేవారు.

Padmakshi temple by Adithyapakide

పద్మాక్షి ఆలయం:
ప్రదేశము:
వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణంలో చౌరస్తా కి అతి దగ్గరలో ఉంటుంది పద్మాక్షి ఆలయం.ఇది హనుమకొండ కి పడమటి దిక్కున కొండ కనుమలలో నిర్మించబడ్డ ఆలయం ఇది.
ఆలయ విశిష్టత:
పద్మాక్షి ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తుంది.ఇక్కడ ఉన్న పద్మాక్షి ఆలయ శాసనం క్రీ.శ.314 నాటి సిరిషాల దేవి కుమారుడు మాధవవర్మ కాకతీయ వంశ మూల పురుషుడని తెలుపుతోంది.కొండ దిగువన పద్మాక్షి గుండం ఉంటుంది.కొండపైకి ఎక్కడానికి సుమారుగా 80 మెట్లు ఉంటాయి. ఈ ఆలయగోపురం నిర్మాణం మెట్లు మెట్లుగా ఉండి జైన నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడి నుంటి చూస్తే హనుమకొండ నగరం మొత్తం కనిపిస్తుంది.గుడి గర్భాలయం ముందు ఒక చిన్న మంటపం ఉంటుంది.ఈ ఆలయం నుండి భద్రకాళి ఆలయం వరకూ సొరంగ మార్గం ఉండేదనీ, దానిని కాలక్రమంలో మూసివేశారని కొందరు అంటున్నారు.
సిద్దేశ్వర చరిత్ర పార్వతీ పరమేశ్వరులు సిద్దేశ్వర పద్మాక్షులుగా భక్తుల కోరికను అనుసరించి అవతరించినట్లు తెలుపుతోంది. గర్భాలయం ఎడమవైపున పద్మాక్షి విగ్రహం పద్మాసనస్తమై యెూగ ముద్రలో కూర్చొని కనిపిస్తుంది.గర్భాలయంలోకి ప్రవేశించిన తర్వాత పద్మాక్షి విగ్రహం ఎడమవైపు దిగంబర జైన విగ్రహాలు కనిపిస్తాయి. గోడకు అమర్చిన శిలపై జైన తీర్థంకుడి విగ్రహం.దాని ఇరు పార్శ్వములు యక్షయక్షినే విగ్రహాలు కనిపిస్తాయి. దేవాలయ మండపం పక్క కొండపైన తీర్థంకర విగ్రహం కనిపిస్తుంది అతని శిరస్సుపైన ఏడు పడగలు విప్పిన పాము కనిపిస్తుంది.దాని పక్కన ద్యాన ముద్రలో జైనుల ప్రతిమలు కనిపిస్తాయి. ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు. ఈ గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీనిమీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్తూపం అని తెలుస్తుంది.కొండపైన జైన తీర్థంకుడగు పార్శనాథుని విగ్రహం పక్కన ఒక స్త్రీ మూర్తి,పక్క భక్తుడు చెక్కబడి కనిపిస్తారు.వీరిరువురూ రెండవ ప్రోలరాజు మంత్రి -బేతన,అతని భార్య మైలాంబలు.ఇక్కడ కొండపైన కొన్ని గుహలు కనిపిస్తాయి. ఇవి జైన సన్యాసులు నివాసాలు.ఈ కొండ పైభాగంలో కనిపించే కోటగోడ హనుమకొండ రాజధానిగా ఉన్న కాలంలో నిర్మించబడ్డది.
ప్రయాణ మార్గం: హనుమకొండ చౌరస్తా మరియు బస్టాండ్ నుండి ఆటోలు, ప్రైవేటు వాహనాలు మరియు కాలి నడకన కూడా పద్మాక్షి ఆలయాన్ని చేరుకోవచ్చు.
Padmakshi Temple Padmakshi Temple Road, Sri Ram Colony, Meerpet, Hanamkonda, Telangana 506001 099087 63228

Bhairanpally by adithyapakide

భైరాన్పల్లి:
1948 ఆగస్టు 27న బైరాన్పల్లిలో నరమేధం జరిగింది. సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైంది.అది 1948 ఆగస్టు 27ఆ రోజు బైరాన్పల్లిలో ఉన్మాదం తాండవించింది. గ్రామ స్వరాజ్యం కోసం 92 మంది ఒకే రోజు నిజాం సేనల చేతుల్లో బలయ్యారు.
బైరాన్పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు. చరిత్రలోకి తొంగిచూస్తే అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం.సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం.. నిజాం సేనలను తొలుత ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టిన సాహసం వారిది. గ్రామాలపై దాడులు చేసి ఊళ్లకు ఊళ్లే తగలబెట్టి వల్లకాడుగా మార్చారు రజాకార్లు. నిజాం రజాకార్ల అకృత్యాలకు ఎంతోమంది తమ మాన ప్రాణాలను కోల్పోయారు. వీరుల్ని నిరాయుధుల్ని చేసి ప్రాణాలు తీసిన పిరికిపందల చరిత్ర ఒక వైపు ఉంటే.. మరోవైపు త్యాగాల చరిత్ర.. వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన మహోన్నత చరిత్ర భైరాన్ పల్ వరంగల్ జిల్లాలోని బైరాన్పల్లి నేడు వీర బైరాన్పల్లిగా మారింది.
జనగామ డివిజన్ మద్దూర్ మండలంలోని గ్రామం బైరాన్పల్లి...
ఏనాటికీ బైరాన్పల్లి పోరాట చరిత్ర మరువనిది. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం.
వీరోచిత పోరాట కేంద్రం.
నిజాం మూకల తూటాలకు, సైన్యం వికృత క్రీడకు బలిపశువయినా శౌర్యాన్ని చూపింది. తిరుగుబాటుకు నెలవుగా మారింది. పోరాటకాలంలో భైరాన్పల్లి ప్రజలు ప్రక్క గ్రామాల ప్రజలకు అండగా నిలిచారు. రజాకార్లకు ఎదురొడ్డి త్యాగాలు చేశారు.
ఓ వైపు యావత్ భారతదేశం స్వాతంత్య్ర సంబురాల్లో మునిగితేలుతూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా మరో వైపు నిజాం రాజుల ఏలుబడిలో ఉన్న పల్లెలన్నీ రజాకారు మూకల ఆగడాలు, దుశ్చర్యలతో వణికిపోతున్నాయి. రజాకార్లను ఎదురించి పోరాడలేక పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు. రజాకార్ల దురాగతాలను భరించలేక వారిపై తొలిసారిగా తిరుగుబాటు ప్రకటించి జంగ్సైరన్ చేసిన గ్రామమే వీరబైరాన్పల్లి. ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యం మరే గ్రామానికి లేదనడంలో సందేహం లేదు.
బైరాన్పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోతారు.
గ్రామంలో అడుగుపెట్టేందుకు నిజాం సైన్యాలు వణికిపోతాయి. పిల్లల నుంచి పడుచు యువతుల దాకా..అంతా ఒక్కటై హైదరాబాద్ సంస్థానాన్ని సవాల్ చేస్తున్న కాలమది. నిజాం చీకటిపాలన నుంచి బయటపడి భారత యూనియన్లో ప్రజాస్వామిక స్వేచ్ఛాగాలులు పీల్చాలని ప్రతి గుండె, ప్రతి గ్రామం తహతహలాడుతున్న సందర్భమది. వరంగల్ జిల్లా బైరాన్పల్లి (నాటి నల్లగొండ జిల్లా) ఈ ఆకాంక్షలకు నిలువెత్తు ఆకృతిగా నిలిచింది.
గ్రామరక్షణ దళం ఏర్పాటు:
బైరాన్పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్యలాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో... బైరాన్పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు . 1948 మే నెలలో బైరాన్పల్లిపై దాడికి విఫలయత్నం 1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు పోరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు. 1948 ఆగస్టు 27న రాక్షసులు పంజా విసిరారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
అవి రజాకార్లు గ్రామాలపై పడి ధన, మాన, ప్రాణాలను దోచుకుంటూ రాక్షస క్రీడలను కొనసాగిస్తున్న రోజులు. వారిని ఎదిరించి పోరాడేందుకు యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. దూళ్మిట్ట, కూటిగల్, లింగాపూర్, బైరాన్పల్లిలోని గ్రామ రక్షక దళాలు బైరాన్పల్లిని ముఖ్య కేంద్రంగా చేసుకొని రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టసాగారు. దీనికి ప్రతిగా రజాకార్లు గ్రామాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఇళ్లను తగులబెట్టి దోపిడీకి పాల్పడే వాళ్లు. గ్రామాలపై దాడులు చేసి దోచుకున్న సంపదతో తిరిగి రజాకార్లపై బైరాన్పల్లి వద్ద దూబూరి రాంరెడ్డి, ముకుందాడ్డి, మురళీధర్రావు నాయకత్వంలో గ్రామ రక్షణ, గెరిల్లా దళాలు దాడిచేసి దోపిడీ సంపదను స్వాధీనం చేసుకొని పంచిపెట్టాయి.
బురుజు నిర్మాణం:
ఈ ఘటన తర్వాత బైరాన్పల్లిపై రజాకార్లు ఏ క్షణానైనా దాడికి పాల్పడే అవకాశముందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామక్షిగిని నిల్వ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపాలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగారా (బెజ్జాయి) మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కట్, కొండాపూర్, లింగాపూర్, దూళ్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకొంటూ వచ్చేవారు. రెండుసార్లు బైరాన్పల్లిపై దాడికి ప్రయత్నించిన రజాకార్లను గ్రామరక్షక దళాలు తిప్పికొట్టడంతో 40 మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు ఏరియా కమాండర్ ఆషీం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి రప్పించిన 500 మంది నిజాం సైనికులతో 1948 ఆగస్టు 27 తెల్లవారుఝామున బైరాన్పల్లిపై మూకుమ్మడి దాడి చేసి ప్రతీ ఇంట్లోకి ప్రవేశించి యువకులను బంధించి ఊరిబయటకు తీసుకువచ్చి లెంకలుగట్టి 96 మందిని కాల్చి చంపారు.
బైరాన్పల్లి మారణకాండ:
1948 ఆగస్టు చివరి వారంలో అర్ధరాత్రి, ఆ ఊరికి కాళరాత్రి అయింది. నిరంకుశత్వం.. దానవరూపమెత్తి ఊరి మహిళలను చెరబట్టింది. దాదాపు వందమందిని నిలబెట్టి నిలువునా కాల్చిచంపింది
ఒకే రోజు 92 మంది గ్రామస్తులను రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. నాటి మారణకాండకు గ్రామం నడిబొడ్డులో ఉన్న బురుజు సాక్షీభూతంగా ప్రస్తుతం దర్శనమిస్తోంది. రజాకార్లను ఎదురించేందుకు బైరాన్పల్లి గ్రామంలోని యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. ఒక రోజు రజాకార్లు గ్రామానికి సమీపంలో ఉన్న ధూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలను రజాకార్లు దోచుకొని, దోచుకున్న సొత్తుతో బైరాన్పల్లి మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. దీనిని గమనించిన గ్రామరక్షక దళాలు రజాకార్లకు అడ్డు తిరిగి వారి వద్ద నుండి సొమ్మును స్వాధీనం చేసుకొని హెచ్చరికలు జారిచేస్తూ రజాకార్లను వదిలి వేసారు.
దీంతో గ్రామంపై కక్ష పెట్టుకున్న రజాకారు మూకలు గ్రామంపై ఐదు సార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడులలో 20 మందికి పైగా రజాకార్లు మృతి చెందారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం బైరాన్పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించి, గ్రామాన్ని నేల కూలుస్తానని సవాలు చేశాడు. రజాకార్లు ఎదో ఒక రోజు గ్రామంపై దాడి చేసే అవకాశం ఉందని భావించి గ్రామస్తులు గ్రామం చుట్టూ కోట గోడ నిర్మించుకొని మధ్యలో ఎతైన బురుజును నిర్మించుకొని దానిని రక్షణ కేంద్రాంగా మలుచుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే బురుజుపైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు నగారాను మోగించేవారు.
ఏరులై పారిన రక్తం..
1947 ఆగస్ట్ 15వ తేదీన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాం రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు వీయలేదు. మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామం సహా చాలా గ్రామాల్లో రజాకార్ల పాశవిక దాడులకు అంతులేకుండా పోయింది. అయితే. బైరాన్పల్లి.. గట్టిగా నిలబడింది. ఊళ్లోని బురుజును స్థావరం చేసుకొని గ్రామంలోకి వచ్చిన రజాకార్లను ప్రతిఘటించి తరిమికొట్టేది. గ్రామరక్షణ దళాలను ఏర్పాటుచేసుకొని రాత్రింబవళ్లూ కాపలా కాసేవారు. బైరాన్ పల్లి గ్రామంపై పట్టుకోసం రజాకార్లు ఐదుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 24 మం దికిపైగా రజాకార్లు ప్రజల చేతుల్లో మరణించారు.దీంతో బైరాన్పల్లిపై నిజాం మూకలు కక్ష పెంచుకున్నాయి. చివరకు దొంగదాడికి పాల్పడ్డాయి.
1948 ఆగస్టు చివరి వారంలో రజాకార్లు, పోలీసులు..నిజాం సైన్యం సాయంతో 12 వందల మంది దాడికి దిగారు. జనగామలో రాత్రి 12గంటలకు పది బస్సులలో బయలుదేరారు. లద్దునూరు మీదుగా బైరాన్పల్లి చేరుకున్నారు. గ్రామం చుట్టూ డేరాలు వేశారు. ఉదయం నాలుగు గంటలకు బహిర్భూమికి వెళ్లిన వడ్ల నర్సయ్యను అదుపులోకి తీసుకున్నా రు. ఆయనను వెంటబెట్టుకొని గ్రామంలోకి వస్తుండగా, వారిని నెట్టివేసి నర్సయ్య ఊళ్లోకి పరుగుపెట్టాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు. నగారా మోగించాడు. దాంతో ఊళ్లో జనమంతా గ్రామ బురుజుపైకి వెళ్లి తలదాచుకున్నారు. వారికి రక్షణగా గ్రామరక్షక దళాలు నిలిచా యి. బురుజుపై నుంచి రజాకార్లపైకి కాల్పులు జరిపాయి. 1948 ఆగస్టు 27న వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 12వందల మంది బలగంతో భారీ మందు గుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామపొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామపొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామ రక్షక దళాలకు అందించే విశ్వనాథ్భట్జోషిని రజాకార్లు పట్టుకొని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకటనర్లయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుండి తప్పించుకొని గ్రామాన్ని చేరుకొని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారు అని కేకలు వేశాడు.
గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బరుజుపైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు.
అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలను ఆడించారు. ఈ దాడులలో ఈ దాడులలో 118మంది అమాయకులు బలికాగా 25మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డులలో ఉంది.
బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30మందిని పొట్టన పెట్టుకున్నారు. బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది.

National press day by adithyapakide



జాతీయ పత్రికా దినోత్సవం:


అధికారంలో ఉన్న వ్యక్తుల చేత, వ్యవస్థల ఇష్టాయిష్టాల వల్ల ప్రభావితం కాకుండా శక్తిమంతమైన ప్రసారమాధ్యమంగా అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చూడటం లక్ష్యంగా భారతదేశంలో నవంబర్‌ 16, 1966వ సంవత్సరంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థాపించారు. ప్రతిసంత్సరం ఈ రోజున నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం) గా జరుపుకుంటారు.
సాంకేతిక విప్లవం తో వార్తలు అందించే తీరు మారినది. రేడియోలు పోయి టెలివిజన్లు వచ్చి సంఘటనలను కళ్ళముందుకు తెచ్చాయి . వార్తలను జరిగిన తరువాత చూపించడం ఆగి , జరుగుతూండగానే ప్రత్యక్ష ప్రసారము చేయగలుగుతున్నాయి . న్యూస్ చానెళ్ళు వచ్చిన తర్వాత ప్రతి నిమిషము ఒక కొత్త వార్తని తాజా కబురంటూ అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లో వార్తలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఇన్ని రకాలుగా వార్తలు అందుకునే అవకాశము ఏర్పడినా వార్తలను అందుకుంటున్నా నేటికీ ప్రజలు వార్తలకోసం చివరిగా నమ్మేది వార్తాపత్రికలను మాత్రమే . ఒక చేతితో వార్తా పత్రిక మరో చేతిలో కాఫీ కప్పు ... అది ఒక రకమైన సామాజిక హోదాకు చిహ్నము . ఇది ఒక భాషకు , ఒక ప్రాంతానికి పరిమితమైన విషయము కాదు . ప్రపంచవ్యాప్తం గా వార్తా పత్రికలకు ఏమాత్రము ఆదరణ తగ్గలేదని చెప్పేందుకు ఎన్నో సాక్ష్యాలలో ఇది ఒకటి .

టెలివిజన్‌ లో ఎవరో చెపితే వార్తను వినాలి . వారు చూపించిన కోణం లోనే వార్త దృశ్యాన్ని చూడాలి . తన ఊహకు ఏమాత్రము తావుండదు . వార్తను మధ్యలో ఆపుకుని పక్కవాడితో మాట్లాడేందుకు , వార్తాంశాన్ని చర్చించేందుకు ఎంతమాత్రము వీలుండదు . కాని ఆ సౌకర్యము వార్తా పత్రికల్లో ఉంటుంది.  పత్రికల్లో చదివే వార్త కూడా మరెవరో రాసినదే కావచ్చు కాని ఆ విలేకరి రాసిన వార్త చదువుతుండగానే సొంత విశ్లేషణ మనసులో మొదలు పెట్టుకునే అవకాశము పాఠకుడుకి ఉంటుంది . ఈ సౌకర్యము టెలివిజన్‌ ప్రేక్షకుడుకి ఉండదు . అందుకే ఓ మోస్తరు పరిజ్ఞానము కలిగిన వారు వార్తాపత్రికల వైపే ఓటు వేస్తుంటారు . ప్రపంచ వ్యాప్తంగా వార్తాపత్రికల నిర్వహణ విషయములో సంక్షోభము తలెత్తినది . టెలివిజన్‌ దాడికి వార్తాపత్రికలు తట్టుకోగలవా అనుకున్నారు . టెలివిజన్‌ దెబ్బకు పత్రికల సర్క్యులేషన్‌ పడిఫోయినా ఆ దెబ్బ తాత్కాలికమే అయింది . క్రమముగా పత్రికా రంగము తిరిగి పుంజుకుని టెలివిజన్‌ కి ధీటుగా నిలబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు . అయినా కొంత సర్క్యులేషన్‌ తగ్గినా అక్కడ స్థిరముగా నిలబడగలిగినది .

మన దేశంలో పత్రికల ప్రారంభం:

మన దేశ వార్తాపత్రిక వ్యవస్థకు పునాది 1780 సంవత్సరములో పడింది . ఆనాటికి పాలన బ్రిటిష వారి చేతిలోకి వెళ్ళింది . కలకత్తా నగరము రాజధానిగా పాలన సాగిస్తున్న కాలము . అటువంటి సమయములో తొలి వార్తాపత్రిక గా " హికీస్ బెంగాల్ గెజిట్ " అనేది జనవరి 29-1780 న విడుదల అయింది . ఆ సంవత్సరములోనే కలకత్తా లో రైటర్స్ బిల్డింగ్ నిర్మాణము కూడా పుర్తయింది . బెంగాల్ గెజిట్ తొలి సంచిక విడుదల అయిన జనవరి 29 ని వార్తాపత్రికా దినోత్సవం గా జరుపుకుంటున్నారు . ఆ పత్రికను ప్రచురించినది " జేమ్స్ అగస్టిన్‌ హిక్ " అందుకే అతని పేరు ... అది ప్రచురితమవుతున్న ప్రాంతమైన బెంగాల్ ను కలిపి ' హికీస్ బెంగాల్ గెజిట్ ' అన్నారు . ఆ పత్రికలోనే తొలి వ్యాపార ప్రకటన విడుదలైంది . వ్యాపార ప్రకటనల్కు నిలయమైన పత్రిక కాబటీ దీనిని ' ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వటైజర్ ' అని కూడా పిలిచేవారు . అప్పటికి భారతదేశములో అక్షరాస్యత తక్కువ , ఇంగ్లిష తెలిసినవారూ తక్కువే అయినా వార్తా పత్రికకు తగినంత ఆదరణ లభించింది . ఈ ప్రజాదరణ గమనించిన కొందరు కొత్త వార్తాపత్రికల్ని ప్రచురించసాగారు . వీటిలో ఇండియన్‌ గెజిట్ , కలకత్త జర్నల్ , బెంగాల్ హరాకరు , జాన్‌ బుల్ ఇన్‌ ది ఈస్ట్ వంటివి ఉన్నాయి .

భారతీయులు ప్రముఖం గా భారతీయ పత్రికా రంగం లోకి అడుగు పెట్టింది 1851 లో దాదాభాయ్ నౌరోజి ద్వారా ఆయన ప్రారంభించిన ఒక రాజకీయ పత్రిక వలన . స్వాతంత్ర భావాలు ను ప్రచారము చేయడం ధ్యేయము గా ఆ పత్రికలు పనిచేశాయి. ప్రత్రికలలో వస్తున్న ప్రమాదం బ్రిటిష్ పాలకులు గుర్తించారు .. తమ పాలనకు వ్యతిరేకం గా వచ్చే వార్తల్ని అడ్డుకునే లక్ష్యము తో 1878 లో సెన్సార్ చట్టాన్ని అమలులో పెట్టారు . అయినా నాయకులు ఏమాత్రము వెనుకంజవేయలేదు . ఎఫ్.సి.మెహతా 1882 లో కైసర్-ఎ-హింద్ పత్రికను ప్రారంభించారు. తాను చేపట్టిన సామాజిక సంస్కరణల ప్రచారానికి రాజా రామమోహన రాయ్ కూడా తన సొంత పత్రికను ప్రారంభించారు . పత్త్రికలకున్న పాత్రను స్వాతంత్ర్యయ పోరాటం లో పాల్గొన్న ప్రతీ నాయకుడు గుర్తించాడు . దాదాపు తొలితరం నాయకులందరూ తమ తమ ప్రాంతీయ భాషలలో గాని , ఇంగ్లీషులో లో గాని పత్రికలు నిర్వహించారు . స్వాతంత్ర్య సమరములో పత్రికలు పో్షించిన పాత్ర అమోఘము . విద్యావ్యాప్తిలో పత్రికల సంఖ్య పెరిగింది . స్వాతంత్ర్యము సిద్ధించేనాటికి మనదేశములో 10 ముండి 12 ఆంగ్ల దినపత్రికలు ప్రముఖంగా ప్రచారములో ఉన్నాయి. వీటిలో టైమ్స్ ఆఫ్ ఇండియా , స్టేట్స్ మన్‌ , పయనీర్ పత్రికలు బ్రిటిష్ యజమానులు నడిపించేవారు . జాతీయ భావముతో చెన్నపట్నం లో " ది హిందూ" , ముంబై లో " ఇండియన్‌ ఎక్ష్ప్ ప్రెస్ " ఢిల్లి లో " హిందుస్తాన్‌ టైమ్స్ , కలకత్తాలో ' అమృత బజార్ ' ఉత్తర భారతం లో ' నేషనల్ హెరాల్డ్ ' , మధ్య భారత లో ' హితవాద ' వెలువడుతుండేవి . మద్రాస్ నుండి ' మెయిల్ ' అనే మరో దినపత్రిక కూడా వచ్చేది . ఆంగ్ల భాషాపత్రికలతో పాటుగా ప్రాంతీయ భాషలలోనూ పత్రికా రంగం వ్యాప్తిచెందింది .
అన్ని భాషలవారూ పత్రికల ప్రచురణలో పోటీపడి ప్రచురించేవారు . ప్రతి భాషలో కొన్ని పత్రికలు అత్యున్నత స్థాయికి చేరడం ,ఆ తర్వాత కనుమరుగవడం జరిగింది .

తెలుగు పత్రికల చరిత్ర:

తెలుగునాట పాఠకులను విశేషం గా కదిలించిన పత్రికలు ' ఆంధ్ర పత్రిక ' కృష్ణా పత్రిక ,లు వాటి ప్రాచుర్యము క్రమముగా కోల్పొయీ మూతబడ్డాయి . తెలుగు భాషకు సంబంధించినంతవరకు నిర్విఘ్నముగా వెలువడుతున్న వార్తాపత్రిక గా ' జమీన్‌ రైతు ' ని పేర్కొనవచ్చును . ఎనిమిది శతాబ్దాలకు పైగా ప్రచురణ చరిత్ర దీనికున్నది . మిగిలిన దేశాలలో ఎలా ఉన్నా మనదేశములో వార్తాపత్రికలు తొలి నుండి ఒక స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తూనే వచ్చాయి . మన దేశములో వార్తాపత్రికలు ప్రారంభమైన తొలిరోజుల్లో ' గెజిట్ ' తన మోటో గా ఒక చక్కని వాక్యం పచురించింది . " మాది ఒక రాజకీయ , వ్యాపార పత్రిక ... అన్ని రాజకీయ పార్టీలకు స్థానము కల్పిస్తాం కాని ఏ రాజకీయ పార్టీ ప్రభావానికి లోను కాము " అన్న నాటి గెజిట్ లక్ష్యమే నేటికీ పత్రికలకు ఆదర్శము గా నిలుస్తుంది . ప్రాంతీయ భాషలలో కొన్ని పత్రికలు కొన్ని పార్టీల కొమ్ము కాసేవిగా ముద్రపడ్డాయి . అయితే అటువంటి రాజకీయ ముద్ర ఆయా పత్రికల ఎదుగుదలను ఏదో ఒక సమయం లో దెబ్బతీస్తుంది . రాజకీయ పార్టీలు తమ సిద్ధాంత ప్రచారానికి తమ కంటూ సొంత పత్రికలు ఉండాలని భావించాయి. అటువంటి పార్టీలలో నేటికీ తమ సొంత పత్రికలను నడుపుకుంటున్నావారు ... కమ్యూనిస్టులు . సి.పి.ఐ., సి.పి.ఎం. వారు అన్ని జాతీయ భాషలలో పత్రికలు నడుపుతున్నారు . కొన్ని సంస్థలు పత్రికల్ను నిర్వహిస్తున్నాయి . పాంచజన్య , ఆర్గనైజర్ వంటి పత్రికలు , ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థలు ప్రచురిస్తున్నాయి. పత్రికలలో పెద్ద పీట రాజకీయ పత్రికలదే . ప్రాంతీయ భాషలలో పత్రికలకు అధిక ఆదరణ ఉండడం గమనించిన జాతీయ స్థాయి పత్రికలు ప్రాంతీయ ఎడిషన్లను ప్రారంభంచాయి. ఇండియా టుడే , సండే ఇండియన్‌ వంటి ఆంగ్ల పత్రికలు దక్షిణాది భాషలలో కూడా తమ ప్రచురణలు మొదలు పెట్టాయి . దేశ రాజధాని అయిన ఢిల్లి నగరం నుంచి పలు ప్రాంతీయ భాషా వార్తాపత్రికల ప్రచురణ ప్రారంభమైంది . ఢిల్లిలో మొత్తం 15 భాషలలో వార్తాపత్రి కలు వస్తున్నాయి . ప్రపంచములో మరే ఇతర దేశ రాజధానిలో ఇన్ని భాషల పత్రికలు విడుల అవడం లేదు . ఢిల్లీ నగరం లో మొత్తం 117 రకాల దినపత్రికలు ఒక షాపులో అందుబాటులో ఉండడం గమనించి ప్రపంచ పత్రికలన్నీ ఆశ్చర్యముతో ఘనం గా ప్రకటించాయి . ఇది ఒక రికార్డు. భారతదేశ జనాభాలో పత్రికలు చదివే పాఠకులు 35 శాతమే ఉన్నారు . అందులో కేవలం 17 శాతము మంది మాత్రమే పత్రికలను కొని చదువుతారు . మిగిలినవారు పత్రికలను పంచుకొని లేదా లైబ్రరీలలో చదువుతుంటారు . పత్రికలను కొని చదివే అలవాటు తెలుగువారిలో తక్కువగా ఉండడం భాధాకరమైన విషయమే. తమిళనాడు లో పత్రికలు కొని చదివే అలవాటు ఎక్కువ అవడం మూలాన పత్రికా రంగం బలము గా స్థిరము గా ఉంది . ఇక్కడ పత్రికలు ఇతర భాషలపత్రికలకన్న తక్కువ ధరకే అందించగలుగుతున్నాయి .

ఇటీవల ఒక సర్వే ప్రకారంఇంగ్లిష్ పత్రికలను సామాజిక హోదాకి ప్రతిబింబము గా భావిస్తుంటారు భారతీయులు .. ఆ పత్రికలలోని అంశాలు చదివినా చదవక పోయినా వాటిని తమ డ్రాయింగ్ బల్ల మీద అందంగా అమర్చివుంచడం చాలా ఇళ్ళలో కనిపిస్తుంది .ఈ విషయం  పత్రికా సర్వేలో వెల్లడైనది . అందుకే మన దేశము లో హిందీ పత్రికల సర్క్యులేషన్‌ 3.5 నుండి 4.0 కోట్లవరకు ఉంటే ... ఇంగ్లిష్ పత్రికల సర్క్యులేషన్‌ 1.2 కోట్ల దగ్గర ఉన్నది . టెలివిజన్‌ చానల్స్ కి దీటుగా పత్రిక సంఖ్య ఉంటుంది . పత్రికా నిర్వహణ లోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు . కొత్తదనం తీసుకొస్తున్నారు. పత్రికారంగం మంచి పోటీరంగం అయింది. పెరుగుతున్న సాంకేతిక ప్రక్రియను తగిన రీతిలో వినియోగించుకోగలిగిన వారికి పాఠక ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదన్నది నిజము .

పత్రికారంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలు:

విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవల కాలం లో ప్రపంచవ్యాప్తం గా పత్రికా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది . ఆర్ధిక సంక్షోభం తోడుగా టెలివిజన్‌ , ఇంటర్నెట్ దెబ్బకు ఆంగ్ల భాషాపత్రికలు బాగా దెబ్బతింటున్నవి.ఐరోపా , అమెరికా ఖండాలలో పత్రికలు పాఠకుల ఆదరణ పొందలేకపోయాయి . ఇటీవల సర్వే ప్రకారము ఐరోపా ఖండం లో పత్రికా పాఠకుల సంఖ్య కేవలం 4.80 కోట్లే. అదే అమెరికాలో ఆ సంఖ్య 9.70 కోట్లు . ఆ రెండు ఖండాలలోని పత్రికా పాఠకుల కలిపిన సంఖ్య కంటే ఎక్కువ మంది భారతదేశములో ఉన్నారు . మన దేశ పత్రిక పాఠకుల సంఖ్య 15 కోట్లు పైనే ఉంటారు అని అంచనా . ప్రపంచం మిగతా ప్రాంతాలలో పాఠకుల సంఖ్య తగ్గుతుంటే భారత్ లో ఏటా 8 శాతము వంతున పెరుగుతుంది . ఇది పత్రికారంగానికి , పాఠకులకు ఆనందం కలిగించే విషము . వార్తా ప్రసారరంగం లో పత్రికలదే పైచేయి అనే విషయము వాణిజ్య ప్రకటనారంగం కూడా నిర్ధారిస్తుంది . మిగిలిన ఎన్ని రకాలుగా వ్యాపార ప్రకటనలు విడుదల చేసినా వినియోగదారుడి మీద ప్రభావం చూపేది మాత్రం పత్రికా ప్రకటనలే అని వారు భావిస్తున్నరు . పత్రికల్లో ప్రకటనలు ఒకటికన్నా ఎక్కువసార్లు పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది . అందుకే అడ్వర్టైజింగ్ బడ్జెట్ లో పత్రికా ప్రకటనకే ఎక్కువ కేటాయిస్తున్నారు


పత్రికలు అందించే సమాచారం:

నేడు పత్రికలు కేవలం వార్తలు మాత్రమే అందించడం లేదు . అన్ని వర్గాలవారికి సంబంధించిన అంశాలను , క్రీడలు , విజ్ఞానం , ఆరోగ్యము , యువతకు సంబంధించిన అంశాలు మున్నగు పలు రకాల విషయాలు ప్రజకు అందిస్తున్నాయి. అది పత్రికలు సమాజానికి చేస్తున్న సేవ . విద్య , ఉపాధికి సంబంధిచిన అంశాలు ప్రత్యేకం గా అందిస్తున్నారు . ఆయా అంశాలకోసం ప్రత్యేక పత్రికలే వెలువడుతున్నాయి . ఆరోగ్యము , మహిళా అంశాలు , సినిమా , హాస్యము ఇలా విడివిడిగా ప్రతి అంశాన్ని ప్రతేకంగా ప్రచురిస్తున్న పత్రికలూ ఉన్నాయి . సాంకేతిక ప్రగతిని పత్రికల తయారీలో  ఉపయోగించుకుంటున్నారు .

Friday, November 3, 2017

Karmanghat hanuman temple by adithyapakide

కర్మాన్ఘట్ ఆంజనేయస్వామి గుడి

నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయానికి చాలానే  చరిత్ర ఉంది.ఒక్కసారి చరిత్ర లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ ఆలయాన్ని కాకతీయులు పన్నెండవ శతాబ్దంలో  కట్టించారు. కాకతీయుల వంశంలో చివరి రాజయిన ప్రతాపరుద్రుడు మరియు ఆయన సైన్యం ఇక్కడికి వేట కోసం వచ్చినప్పుడు ఆయన  అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రిస్తున్నపుడు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో "రామా ......రామా..."అనే అరుపులు వినిపించాయి.అపుడు వెంటనే ఉలిక్కిపడి లేచిన ప్రతాపరుద్రుడు ఆ అరుపులు సమీపంలోని ఒక విగ్రహం నుండి వస్తున్నట్లుగా గమనించాడు.ఆ తరువాత ప్రతాపరుద్రుడు తిరిగి తన నగరమైన ఓరుగల్లుకి చేరుకున్నాక ఆ రోజు  కలలో ఆంజనేయస్వామి దర్శనమై తనకు ఆ ప్రదేశం లో ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించాడు.అపుడు తక్షణమే ప్రతాపరుద్రుడు ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఇదిలా ఉండగా 1687 లో గోల్కొండ పైకి దండయాత్ర చేసిన మెుఘల్ చక్రవర్తి ఐన జౌరంగజేబు హిందూ ఆలయాలని ధ్వంసం చేసే క్రమంలో ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్దకి వచ్చి దానిపై కి గునపంని ఎత్తగానే   'కర్ మాన్  ఘట్ ' అనే భీకరమైన అరుపు అతనికి వినపడింది.ఇప్పుడు మనం పిలుస్తున్న  కర్మాన్ఘట్ అనేది అప్పటినుండే వాడుకలోకి వచ్చింది.

ఇంతటి చరిత్రని కలిగి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆంజనేయస్వామి పుట్టినరోజున అంటే హనుమాన్ జయంతి రోజున ఇక్కడి పూజారులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .కొన్ని ప్రత్యేక రోజుల్లో అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.
#kakthiyas #Prathaparudra.
#karmanghat.#Hanumantemple.
##adithyapakide.



సెలడన్ పాత్రలు by adithyapakide

దాదాపుగా 2000సంవత్సరాల క్రితం చైనా,పర్షియాలలో తయారయిన ముదురుపచ్చ రంగు,నీలిపచ్చ రంగు లాంటి ప్రత్యేక రకం పాత్రలను సెలడన్ పాత్రలు అని అంటారు. అప్పట్లో మన దేశంలోని రాజులు, జమీందారులు వీటిని దిగుమతి చేసుకునేవారు.ఆహార పదార్థాలు విషతుల్యమైతే పాత్రలు పగిలిపోవడం మరియు ఆహార పదార్థాలు రంగుమారడం వీటి ప్రత్యేకత. పాత్రల అడుగు భాగాన ఉన్న రేఖలు వారి సృజనాత్మకతను తెలియచేస్తాయి. వాటిలో ముఖ్యంగా సింహాలను పోలిన బొమ్మలు, తీగలు మరియు పవిత్రమైన ఖురాన్ వాఖ్యాలను కూడా మనం గమనించవచ్చు.

Tuesday, October 31, 2017

Mahavir harina vanasthali national park by adithyapakide

Mahavir harina Vanasthali national park https://commons.wikimedia.org/wiki/File:Mahavir_harina_Vanasthali_national_park.jpg

Friday, October 27, 2017

APJ Abdhul Kalam by adithyapakide

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
86వ జయంతి
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్(అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.
తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.
 *🌿బాల్యం మరియు విద్యాభ్యాసం*
అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు.

పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు మరియు ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లిచేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడరు.
 *🌿శాస్త్రవేత్తగా*
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDO లో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచెసి జూలై 1980 లో ఈ వాహనం రోహిణిఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. [ఇస్రో]లో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి. 1970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు
 *🌿మరణం*
రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోనిఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

Adithyapakide


Wednesday, October 18, 2017

దీపావళి

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే #దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే  పండుగలలో ఒక రాక్షసుణ్ణి  మరణాన్ని  ఆనందంగా పండుగ చేసుకోవడం - నరక చతుర్దశి విశిష్టత. పండుగలకు - ఖగోళ  సంఘటనలకు సంబంధం ఉంది.  నరకాసుర వధ - చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో  రాసులస్తితిని  సూచించేది.  తులారాశి తూర్పు  క్షితిజం  మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి.  కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ  సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది.  స్వాతి నక్షత్రానికి వాయువు దేవత.  దాన్ని అధిస్టించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు - సూర్యుడు, సత్యభామ-చంద్రుడు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యున్ని - కృష్ణున్ని నాయకునిగా చేసుకునింది. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి  నిదర్శనం.

నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది.   హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

    చతుర్దశ్యాం తు యే దీపాన్‌
    నరకాయ దదాతి చ|
    తేషాం పితృగణా స్సర్వే
    నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

Tuesday, October 17, 2017

Adithyapakide




Adithyapakide





షోయబుల్లా ఖాన్ … అసలుసిసలు జర్నలిస్ట్. పత్రికా స్వేచ్ఛ కోసం ప్రాణాలొదిలిన తొలి కలం వీరుడు షోయబుల్లా ఖాన్. ఆయన పుట్టింది ఈ రోజే. ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడులో పుట్టారు. ముస్లిం మత దురహంకారానికి వ్యతిరేకి. ఇమ్రోజ్ పత్రికతో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చేలా షోయబ్ రచనలు సాగాయి. ‘‘మరణం అనివార్యం. చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి’’ అంటూ షోయబుల్లా ఖాన్ తుది శ్వాస విడిచారు.


బాల్యం -విద్యాభ్యాసం:

అక్షరంగా మారడానికి 1919 అక్టోబర్ 17న ఓ అగ్నికణం కళ్లు తెరిచింది.. ఆ అగ్నికణమే షోయబుల్లాఖాన్. ఖమ్మం జిల్లా సుబ్లేడ్ లో పుట్టాడు. తల్లి షయిబుల్లా.. తండ్రి హీబీబుల్లా.. రైల్వేలో కానిస్టేబుల్ కావడంతో హబీబుల్లాకు హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీలో షోయబుల్లా ఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తెలంగాణ అగ్నిగోళంలా మండుతోన్న కాలమది…. దొరల దోపిడి సాగదంటూ సామాన్యుడు సమరం సాగిస్తున్న సమయమది. రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురిస్తూ హైదరాబాద్ లో రగల్ జెండా రెపరెపలాడుతున్న రోజులవి. సరిగ్గా అప్పుడే గుండెల నిండా ప్రజాస్వామ్య కాంక్షతో.. దౌర్జన్యాన్ని ఎదురించే చైతన్యంతో క్యాంపస్ నుంచి షోయబుల్లా ఖాన్ బయటకొచ్చాడు. తాను చదివిన చదువుకు.. కోరుకుంటే ఏ ఉద్యోగమైనా కాళ్ల దగ్గరకే వచ్చేది.. నిర్బంధాన్ని ప్రశ్నించే ధైర్యం నరనరాన పాకుతుంటే.. తలదించుకుని ఉద్యోగం చేయాలా? అందుకే అక్షరాన్ని ఆయుధంగా మార్చి నియంతృత్వంపైనే సమరం చేయాలనుకున్నాడు. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాడు.
ఉర్దూ అధికార భాషగా ఉన్న ఆ కాలంలో పత్రికలన్నీ నిజాంకు అనుకూలంగా ఉండేవి.. ఏవో ఒకటి రెండు పత్రికలు తప్ప.. షోయబుల్లాఖాన్ అలాంటి పత్రికనే ఎంచుకున్నాడు.. తేజ్ అక్బార్ లో చేరాడు… రజాకార్లు, భూస్వాముల ఆగడాలపై ప్రతీరోజూ అక్షరాలను ఎక్కుపెట్టాడు..ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలకు అందించాడు..అందుకే తేజ్ అక్బార్ ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. కణకణమండుతోన్న నిప్పుకణిల్లాంటి షోయబుల్లాఖాన్ అక్షరాలకు అవకాశం ఇవ్వడానికి రయ్యత్ ముందుకొచ్చింది. అక్కడ షోయబుల్లాఖాన్ ఆవేశానికి అక్షరాలు కట్టలు తెంచుకున్నాయి..ఆ కలంపోటు నిజాంను ఉక్కిరిబిక్కిరిచేసింది..దీంతో దాన్ని బంద్ చేయించాడు.
నిజాం దౌర్జన్యాన్ని ఎదురించడానికి సొంత పత్రిక ఉంటేనే మంచిదనుకున్నాడు షోయబుల్లాఖాన్. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో భార్య, తల్లి నగలను అమ్మి ఇమ్రోజ్ ను స్థాపించాడు. 1947 నవంబర్ 17న మొదటి సంచిక వెలువడింది. అందులో షోయబుల్లా పెన్ను గన్నయింది. బుల్లెట్లలా అక్షరాలు నిజాం గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఆయన రాతలు రజాకార్లకు వాతలు పెట్టాయి. వెన్నులో వణుకుపుట్టడంతో ఖాసీం రజ్వీ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అయినా షోయబుల్లాఖాన్ అక్షరాలు తడబడలేదు. మరిన్ని అన్యాయాలను ఎండగట్టాడు. ఎర్రకోటపై నిజాం జెండా ఎగరవేస్తానన్న రజ్వి ప్రకటనతో.. షోయబుల్లాఖాన్ రక్తం కుతకుతలాడింది. రజ్వీ దురహంకారాన్ని ఇమ్రోజ్ లో తీవ్రంగా వ్యతిరేకించాడు. నిజాంను వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తే చేతులు నరికేస్తామని.. పత్రికను సర్వనాశనం చేస్తామని రజ్వీ బహిరంగంగానే బెదిరించాడు. అయినా షోయబుల్లా ఖాన్ తగ్గలేదు. సత్యాన్వేషణలో ప్రాణాలు పోవడం గర్వించాలన్న విషయమన్నాడు. అప్పుడే అతని అంతానికి ఆరంభం మొదలయింది.

1948 అగష్టు 22.. కాచీగూడలోని ఇమ్రోజ్ ఆఫీసులో వర్క్ కంప్లీట్ చేసుకుని అర్ధరాత్రి ఇంటికి బయలుదేరాడు షోయబుల్లా.. బావమరిది ఇస్మాయిల్ ఖాన్ కూడా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. ఒక్కసారిగా పదిమంది దుండగలు షోయబుల్లాఖాన్ పై విరుచుకుపడ్డారు.. తన రాతలతో రజ్వి గుండెకు చెమటలు పట్టించిన చేతులను నరికేశారు.. భయమంటే తెలియని ఆ గుండెపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు… అడ్డుకోబోయిన ఇస్మాయిల్ నూ వదల్లేదు.. అయితే తుపాకీ చప్పుళ్లు విని స్థానికులు బయటకురావడంతో దుండగులు పారిపోయారు.. నెత్తిటి మడుగులో ఉన్న షోయబుల్లాను ఉస్మానియాకు తరలించారు..రెండు గంటల తరువాత స్పృహలోకి వచ్చిన షోయబుల్లా.. ఇమ్రోజను కొనసాగించమన్నాడు..ధర్మానిదే గెలుపని కన్నుమూశాడు.

హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాలన్నది షోయబుల్లాఖాన్ కల.. దాని కోసం నడిరోడ్డు మీదనే ప్రాణాలను బలిపెట్టాడు. దేహంతో మొదలయ్యే జీవన ప్రస్థానం దేహంతోనే అంతమవుతుంది..కాని ఓ వీరుని రక్తపు చుక్క వేల వీరులకు జన్మనిస్తుంది. ప్రాణం తీయవచ్చు.. కానీ ఆశయాన్ని చంపలేరు. అందుకే అక్షరమే ఆయుధంగా నిరంకుశత్వంపై పోరాడిన కలం వీరుడు షోయబుల్లాఖాన్ వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టు కొనసాగించాలి. ఆత్మగౌరవ పాలన కోసం సాగుతున్న అస్తిత్వపోరులో అక్షరసేనానులగా మారిన ప్రతీ జర్నలిస్ట్ కలంలో షోయబుల్లాఖాన్ బతికే ఉంటాడు.
#Journalist.
#Shoyabullakhan#IMROJE.
##Adithyapakide.

Thursday, September 28, 2017

Adithyapakide

Check out adithya pakide (@adithya_pakide): https://twitter.com/adithya_pakide?s=09

Sunday, September 17, 2017

Adithyapakide




Tribal museum by adithyapakide

మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన విజ్ఞాన భాండాగారంగా భాసిల్లుతోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 1963లో దీన్ని  ఏర్పాటు చేశారు. నాటి నుంచి పురాతన గిరిజన వస్తు సామగ్రిని సేకరిస్తూ వారి సంస్కృతి సంప్రదాయాలను వివరించేలా మ్యూజియంను ఏర్పాటు చేశారు. 1989లో జరిగిన జవహర్ లాల్  నెహ్రూ  గారి శతజయంతిని పురస్కరించుకొని ఈ సంగ్రహాలయానికి 'నెహ్రూ గిరిజన సంగ్రహాలయం'గా నామకరణం చేశారు. మాసాబ్ ట్యాంక్  సంక్షేమభవన్ ప్రాంగణంలో 2003లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ మ్యూజియానికి 3 అంతస్తుల సొంత భవనం ఏర్పాటు చేశారు.

ఇందులో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజన జీవనం, కళలకు సంబంధించిన పలు వస్తువులు వాటిని వివిధ విభాగాలలో గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో చెంచు ఫొటోగ్రఫీ, గిరిజన గుడిసెలు, గిరిజన జీవన, సంస్కృతి,  ప్రాంగణ ప్రదర్శన, గిరిజన కళా ప్రాంగణ విభాగాలున్నాయి. చెంచు గ్యాలరీలో గిరిజనులు కర్రతో అగ్ని పుట్టించే విధానం, గుడిసెల్లో వంట చేసుకోవడం, వేటాడే విధానం, భూమిలో నుంచి గడ్డలు తవ్వుకునే విధానం, వారి బాణాలు, తేనె సేకరణ పనిముట్లు, తేనె సేకరణ విధానాలు ప్రదర్శనకు ఉంచారు.

సంగ్రహాలయం మొదటి అంతస్తులో సవర గుడిసె, చెంచు గుడిసె, బంజారా గుడిసె, కోయ గుడిసె తదితర గిరిజన గుడిసెలను ప్రదర్శనకు ఉంచారు. గుడిసెల్లో గిరిజనుల జీవన విధానం ప్రస్ఫుటంగా కనిపించేలా పలుచోట్ల గిరిజనుల విగ్రహాలు, రకరకాల పనుల్లో నిమగ్నమైనట్లు ప్రతిమలను ఏర్పాటు చేశారు.
ఆ కాలంలో కుందేలు, చేపలు మరియు వివిధ రకాలైన పక్షులను వేటాడటానికి ఉపయెూగించే ఆయుధాలు మరియు నీటిని నిల్వ చేసుకోవడానికి అప్పట్లో వారు ఉపయెూగించిన వస్తువులు చూడవచ్చు.

 ఇక్కడి ఫోటో గ్యాలరీలలో  ప్రసిధ్ద గిరిజనుల  నృత్యమైన' థీమ్సా ' మరియు దానిలో 7 రకాలైన నృత్యాలైన గుండెరి థీమ్సా, బోడ్ థీమ్సా, గోడ్డి థీమ్సా, పాథర్ థీమ్సా, కుండా థీమ్సా, బాయా థీమ్సా, భాగ్ థీమ్సాలకు సంబంధించిన చిత్రాలను చూడవచ్చు.

 సాంస్కృతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలైన సన్నాయి, కిన్నెర, కిరీడి, థామర్,కొమ్ము, పానిర్,డోలు  మెుదలైన వాటిని చూడవచ్చు.  దృశ్య శ్రవణ విభాగంలో లఘుచిత్ర ప్రదర్శనశాలను (ఆడిటోరియం)  ఏర్పాటు చేశారు.

సందర్శన వేళలు:ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం -శనివారం ఆదివారం సెలవు.
ప్రవేశం ఉచితం.

Nehru Centenary Tribal Museum
Owaisi Pura, Masab Tank, Owaisi Pura, Masab Tank, Hyderabad, Telangana 500028
081796 84889

https://goo.gl/maps/bPZ8KYwUPRB2

#NehrucentenaryTribalmuseum.
#DSSbhavan.#Masabtank.
#Hyderabad.
#Adithyapakide.







Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...